
సాక్షి, బళ్లారి : స్నేహితులతో కలిసి కొత్త సినిమాకు వెళ్తే ఏకంగా ప్రాణమే పోయిందంటూ మృతుడి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం... బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకా శాసవాసపురకు చెందిన రాము (25) అనే యువకుడు టాలీవుడ్ నటుడు పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం విడుదల సందర్భంగా మిత్రులతో కలిసి విందు జరుపుకున్నాడు.
బళ్లారి నగరానికి వచ్చి ఓ థియేటర్‌లో అజ్ఞాతవాసి సినిమాకు బుధవారం రాత్రి షోకు వెళ్లాడు. సినిమా మధ్యలో బాత్‌రూమ్‌కు వెళ్లాడు. అక్కడ ఫినాయిల్ ఉన్న బాటిల్‌ను కూల్‌డ్రింక్‌గా భావించి సేవించాడు. బాత్‌రూమ్‌లోనే అస్వస్థతకు గురయ్యాడు. థియేటర్ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై బ్రూస్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment