
వాట్సప్‌లో హల్‌చల్ చేస్తున్న ఫొటో
రాయదుర్గం అర్బన్: బళ్లారి రైల్వేస్టేషన్‌లో ఇద్దరు పిల్లలు దొరికారని, వీరు రాయదుర్గానికి చెందినవారని, వివరాల కోసం రెండు ఫోన్ నంబర్లను సంప్రదించాలని వాట్సప్‌లో ఓ ఫొటో హల్‌చల్ చేస్తోంది. వాస్తవానికి రాయదుర్గం పోలిస్‌స్టేషన్ పరిధిలో చిన్నారుల మిస్సింగ్‌పై ఎటువంటి ఫిర్యాదూ నమోదు కాలేదు. వాట్సప్‌లో ఇచ్చిన నంబర్లను ‘సాక్షి’ సంప్రదిస్తే ఒకరు రాయదుర్గం పట్టణ ఏఐఎస్‌ఎఫ్ నాయకుడు, ప్రస్తుతం శ్రీరామ్‌చిట్స్‌లో పనిచేస్తున్న అనిల్‌కుమార్, మరొకరు తిరుమలకు చెందిన టీటీడీ ఉద్యోగి కోటేష్‌గా తేలింది. పిల్లల విషయంలో తమకు ఎటువంటి సంబంధమూ లేదన్నారు. ఆకతాయిలెవరో తమ నంబర్లు పొందుపరిచారని, ఆదివారం సాయంత్రం నుంచి తమకు 80 నుంచి 90 మంది దాకా ఫోన్‌కాల్స్ వచ్చాయని, వారికి సమాధానం చెప్పుకోలేక ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పారు. ఇదే విషయంపై ఎస్‌ఐ నాగేంద్ర ప్రసాద్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా, చిన్నారుల మిస్సింగ్‌కు సంబంధించి తమకు ఎటువంటి ఫిర్యాదూ రాలేదన్నారు. ఫేక్ మెసేజ్ అయి ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment