
చిరు, పవన్ అభిమానుల మధ్య గొడవ
ఒకరి హత్య.. బళ్లారిలో ఘటన
సాక్షి, బళ్లారి: చిరంజీవి, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య జరిగిన గొడవ ఒకరి హత్యకు దారితీసింది. కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బళ్లారి నగరంలోని కౌల్‌బజార్‌కు చెందిన ఇద్దరు యువకులు ఈ నెల 20న ఒకచోట కలిశారు. వీరిలో ఒకరు పవన్‌కల్యాణ్ అభిమాని కాగా, మరొకరు చిరంజీవి అభిమాని.
చిరంజీవి అభిమాని ‘మా అన్న మెగాస్టార్‌ను మించిన హీరో ఎవరూ లేరు’ అంటూ వాగ్వాదానికి దిగాడు. దీంతో మాటా మాటా పెరిగింది. పవన్ క ల్యాణ్ అభిమానిని చిరంజీవి అభిమాని ఇనుప రాడ్‌తో కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.