
నడిరోడ్డుపై దర్శనమిచ్చిన మొసలి
కర్ణాటక,బళ్లారి టౌన్: నగరంలోని సెకండ్ రైల్వే గేట్ వద్ద ఆదివారం రాత్రి ఓ మొసలి నడిరోడ్డు పైకి వచ్చి కలకలం సృష్టించింది. స్థానికంగా ఉంటున్న కాంగ్రెస్ నేత మోహన్‌బాబు ఆ సమయంలో తన కారులో వెళుతుండగా రోడ్డుపై మొసలి కనిపించింది. దీంతో కారును ఆపి కొద్ది సేపు అది దూరంగా వెళ్లేంత వరకు అలాగే ఉండి వెళ్లి పోయారు. కాగా ఇదే ప్రాంతంలో జూ కూడా ఉంది. అందులో నుంచి ఏమైనా తప్పించుకొని వచ్చి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా మొసలి ఒక్కసారిగా నడి రోడ్డుపైకి రావడం ఆ ప్రాంత వాసులను భయాందోళనకు గురి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment