Rashmika Mandanna Receives A Surprise Gift From UK Fan - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna : అభిమాని నుంచి రష్మికకు ఊహించని సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌.. నటి ఎమోషనల్‌

Published Tue, Mar 7 2023 2:56 PM | Last Updated on Tue, Mar 7 2023 3:40 PM

Rashmika Mandanna Receives Surprise Gift From Uk Fan - Sakshi

హీరోయిన్‌ రష్మికా మందన్నా అతి తక్కువ సమయంలోనే నేషనల్‌ క్రష్‌గా మారి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీబిజీగా మారిపోయింది. సౌత్‌, నార్త్‌ ఇలా అన్ని భాషల్లో వరుస సినిమాలతో ఆకట్టుకుంటుంది.

ఇక పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా ఫ్యాన్‌ బేస్‌ను సొంతం చేసుకున్న రష్మికకు యూత్‌లో మాంచి ఫాలోయింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ అభిమాని నుంచి ఆమెకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ అందింది. సీతాకోకచిలుకల డిజైన్‌తో నిండి ఉన్న కలర్‌ఫుల్‌ బొకేను యూకేలో ఉండే ఓ ఫ్యాన్‌ రష్మిక కోసం పంపించాడు.

ఆ గిఫ్ట్‌ చూసి ఎమోషనల్‌ అయిన రష్మిక తన ఇన్‌స్టా స్టోరీలో దాని గురించి రాసుకొచ్చింది. 'ఈ గిఫ్ట్‌ నా హృదయాన్ని కదిలిచింది. ఇందులో పేరు లేదు, కానీ ఇది ఎవరైనా వారిని నేను ఎప్పటికీ ప్రేమిస్తుంటాను. నువ్వు నిజంగా నాలో సంతోషాన్ని నింపావు, బిగ్‌ టెడ్డీ బేర్‌ హగ్స్ టూ యూ' అంటూ తన ప్రేమను వ్యక్తపరిచింది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement