Puri Jagannadh Fan Shares Open Letter Over Liger Distributors Issue, Post Viral - Sakshi
Sakshi News home page

Puri Jagannadh: నిజమే పూరీ పెద్ద మోసగాడు.. పరువు తీసేద్దాం పదండి!: అభిమాని లేఖ వైరల్‌

Published Fri, Oct 28 2022 10:38 AM | Last Updated on Fri, Oct 28 2022 11:13 AM

Puri Jagannadh Fan Shares A Open Letter Over Liger Distributors Issue - Sakshi

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ కొద్ది రోజులుగా వారల్లో నిలుస్తున్నాడు. ఇటీవల లైగర్‌ మూవీ డిస్ట్రిబ్యూటర్‌తో ఆయన మాట్లాడిన ఆడియో కాల్‌ చర్చనీయాంశమైంది. ఇటీవల ఆయన భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన లైగర్‌ మూవీ బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టింది. లైగర్‌ ఫ్లాప్‌తో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌ భారీగా నష్టపోయారు. అయితే ఈ సినిమాకు పూరీ కూడా ఓ నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. లైగర్‌ ఫ్లాప్‌తో తమకు కొంత డబ్బు వెనక్కి ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్స్‌ పూరీని డిమాండ్‌ చేశారు. అయితే దీనికి అయినా కొంత గడువు అడిగినప్పటికీ కొందరు డిస్ట్రిబ్యూటర్స్‌ ఆయన ఆఫీసు ముందు ధర్నా చేసేందుకు సిద్ధపడ్డారు.

చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న జెర్సీ నటుడు, చెన్నైలో నేడు గ్రాండ్‌ వెడ్డింగ్‌

దీంతో తన పరువు తీసే ప్రయత్నాలు చేస్తే అసలు డబ్బు ఇవ్వనంటూ పూరీ వారిని వారించిన ఆడియో ఈమధ్య బయటకు వచ్చింది. దీంతో పూరీ పరువు తీసేందుకు కావాలనే ఈ ఆడియోను లీక్‌ చేశారని, కొంతమంది పని గట్టుకునిన ఆయనను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాంటి వారిని ఉద్దేశిస్తూ పూరీ ఫ్యాన్‌ ఒకరు బహిరంగ లేఖ రాశారు. అవును డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ నిజంగా ఓ మోసగాడు. పరువు తీసేద్దాం పదండి! అంటూ అతడు ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్‌ ప్రస్తుతం ఇండస్ట్రీలో, సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇందులో అతడు డైరెక్టర్‌ పూరీ గురించి ఈ లొల్లి ఏందో నాకేం అర్థం కావట్లా..! పూరీ ఫ్యాన్‌గా కాదు. సాదాసీదా ఆడియన్‌గా సూటిగా అడుగుతున్నా సమాధానం చెప్పండి!

‘‘అవును డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. నిజంగా ఓ మోసగాడు. పరువు తీసేద్దాం పదండి! ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్.. మైల్ స్టోన్స్ లాంటి సినిమాలను ఇచ్చి.. ఇప్పుడు ఇలాంటి కుట్రల మధ్య నలిగిపోతున్నందుకు ఖచ్చితంగా పరువు తీసేయాలి. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరికీ, ఒక్కో మార్క్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు కదా.. మోసగాడు అనే ముద్ర తప్పకుండా వేయాల్సిందే. దర్శకుడిగా, నిర్మాతగా తాను వందల కోట్లు నష్టపోయినా.. ఎప్పుడూ ఎవరి పేర్లు బయట పెట్టనందుకు, ఎవరినీ బాధ్యులను చేయకుండా పల్లెత్తు మాట కూడా అనకుండా ఉన్నందుకు పక్కాగా కుటుంబంతో సహా రోడ్డుకు లాగాలి.

చదవండి: ఫ్యాన్స్‌తో తమన్నా మాస్‌ డాన్స్‌, వీడియో వైరల్‌

అవును.. తాను సమాజంలో పరువుగా బ్రతకాలని అనుకుని.. ఇన్నాళ్లు ఎవరి పరువు తీయకుండా ఉన్నందుకు బుద్దొచ్చేలా పరువు తీయాలి. తనను ఎంతోమంది మోసగించినా.. ఎన్ని ప్లాప్స్ వచ్చినా.. బ్లాక్ బస్టర్స్ తో బౌన్స్ బ్యాక్ అయ్యే డాషింగ్ డైరెక్టర్ ని ఇలాగే పరువు తీసి సత్కరించాలి’’ అంటూ తన లేఖలో రాసుకొచ్చాడు. పూరీకి మద్దతు తెలుపుతూ ఆయన పురువు తీయాలని చూసేవారిపై అసహనం వెల్లగక్కుతు ఈ సందర్భంగా అతడు ఒపెన్‌ కామెంట్స్‌ చేశారు. ఇదిలా ఉంటే తనకు, తన కుటుంబానికి డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్‌ల ద్వారా ప్రాణహాని ఉందంటూ ఇటీవల ఆయన జూబ్లీహిల్స్‌ పోలీసులు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement