distributers
-
రోడ్డెక్కిన లైగర్ బయ్యర్లు, ఎగ్జిబిటర్లు
-
నిజమే పూరీ పెద్ద మోసగాడు.. పరువు తీసేద్దాం పదండి!: అతడి లేఖ వైరల్
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొద్ది రోజులుగా వారల్లో నిలుస్తున్నాడు. ఇటీవల లైగర్ మూవీ డిస్ట్రిబ్యూటర్‌తో ఆయన మాట్లాడిన ఆడియో కాల్ చర్చనీయాంశమైంది. ఇటీవల ఆయన భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన లైగర్ మూవీ బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టింది. లైగర్ ఫ్లాప్‌తో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోయారు. అయితే ఈ సినిమాకు పూరీ కూడా ఓ నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. లైగర్ ఫ్లాప్‌తో తమకు కొంత డబ్బు వెనక్కి ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్స్ పూరీని డిమాండ్ చేశారు. అయితే దీనికి అయినా కొంత గడువు అడిగినప్పటికీ కొందరు డిస్ట్రిబ్యూటర్స్ ఆయన ఆఫీసు ముందు ధర్నా చేసేందుకు సిద్ధపడ్డారు. చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న జెర్సీ నటుడు, చెన్నైలో నేడు గ్రాండ్ వెడ్డింగ్ దీంతో తన పరువు తీసే ప్రయత్నాలు చేస్తే అసలు డబ్బు ఇవ్వనంటూ పూరీ వారిని వారించిన ఆడియో ఈమధ్య బయటకు వచ్చింది. దీంతో పూరీ పరువు తీసేందుకు కావాలనే ఈ ఆడియోను లీక్ చేశారని, కొంతమంది పని గట్టుకునిన ఆయనను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాంటి వారిని ఉద్దేశిస్తూ పూరీ ఫ్యాన్ ఒకరు బహిరంగ లేఖ రాశారు. అవును డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నిజంగా ఓ మోసగాడు. పరువు తీసేద్దాం పదండి! అంటూ అతడు ఫేస్బుక్లో చేసిన పోస్ట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇందులో అతడు డైరెక్టర్ పూరీ గురించి ఈ లొల్లి ఏందో నాకేం అర్థం కావట్లా..! పూరీ ఫ్యాన్‌గా కాదు. సాదాసీదా ఆడియన్‌గా సూటిగా అడుగుతున్నా సమాధానం చెప్పండి! ‘‘అవును డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. నిజంగా ఓ మోసగాడు. పరువు తీసేద్దాం పదండి! ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్.. మైల్ స్టోన్స్ లాంటి సినిమాలను ఇచ్చి.. ఇప్పుడు ఇలాంటి కుట్రల మధ్య నలిగిపోతున్నందుకు ఖచ్చితంగా పరువు తీసేయాలి. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరికీ, ఒక్కో మార్క్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు కదా.. మోసగాడు అనే ముద్ర తప్పకుండా వేయాల్సిందే. దర్శకుడిగా, నిర్మాతగా తాను వందల కోట్లు నష్టపోయినా.. ఎప్పుడూ ఎవరి పేర్లు బయట పెట్టనందుకు, ఎవరినీ బాధ్యులను చేయకుండా పల్లెత్తు మాట కూడా అనకుండా ఉన్నందుకు పక్కాగా కుటుంబంతో సహా రోడ్డుకు లాగాలి. చదవండి: ఫ్యాన్స్‌తో తమన్నా మాస్ డాన్స్, వీడియో వైరల్ అవును.. తాను సమాజంలో పరువుగా బ్రతకాలని అనుకుని.. ఇన్నాళ్లు ఎవరి పరువు తీయకుండా ఉన్నందుకు బుద్దొచ్చేలా పరువు తీయాలి. తనను ఎంతోమంది మోసగించినా.. ఎన్ని ప్లాప్స్ వచ్చినా.. బ్లాక్ బస్టర్స్ తో బౌన్స్ బ్యాక్ అయ్యే డాషింగ్ డైరెక్టర్ ని ఇలాగే పరువు తీసి సత్కరించాలి’’ అంటూ తన లేఖలో రాసుకొచ్చాడు. పూరీకి మద్దతు తెలుపుతూ ఆయన పురువు తీయాలని చూసేవారిపై అసహనం వెల్లగక్కుతు ఈ సందర్భంగా అతడు ఒపెన్ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే తనకు, తన కుటుంబానికి డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్ల ద్వారా ప్రాణహాని ఉందంటూ ఇటీవల ఆయన జూబ్లీహిల్స్ పోలీసులు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
డిస్ట్రిబ్యూటర్ల నకిలీ లేఖలు కలకలం
సాక్షి, విశాఖపట్నం: సినిమా టికెట్ ధరల వ్యవహారం విశాఖలో కాకరేపుతోంది. ప్రభుత్వంపై బురదజల్లడానికి ఒక వర్గం ప్రయత్నిస్తుందన్న వార్తలు ఇప్పుడు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. చోడవరానికి చెందిన ఒక ఎగ్జిబిటర్ తమ ప్రమేయం లేకుండా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేశారంటూ మిగిలిన ఎగ్జిబిటర్లు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని చెప్పకుండా తమతో సంతకాలు చేయించుకున్నారంటూ.. గత నెల 25న జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డికి ఫిర్యాదు చేయడం సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పెద్ద... చిన్న సినిమాలనే తారతమ్యం లేకుండా అన్ని సినిమా థియేటర్లలో ఆడాలి.. ప్రజలకు అందుబాటు ధరల్లో టికెట్ ఉండే విధంగా ప్రభుత్వం జీవో–35 జారీ చేసింది. దీనిపై ఎగ్జిబిటర్లు వ్యతిరేకంగా ఉన్నారంటూ కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు నకిలీ లేఖలు సృష్టించి కేసులు వేశారు. ఆ సమయంలో కోర్టుకు సమర్పించిన లేఖల్లో నకిలీవని కొంతమంది ఎగ్జిబిటర్లు చెబుతుండడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. డిస్ట్రిబ్యూటర్లలో ఒక వర్గం వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను, సినీ వర్గాల వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. జేసీ ఆదేశాల మేరకే టిక్కెట్ల రేట్లు జీవో 35 రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సినిమా టికెట్ ధరలు పాత విధానంలో అమలు చేయాలా.. లేదా అనేది జేసీ ఆదేశాల మేరకు నిర్ణయించాలని పేర్కొంది. కోర్టుని ఆశ్రయించిన వారెవరూ ఇప్పటి వరకు తనని సంప్రదించలేదని జేసీ ఇప్పటికే వెల్లడించారు. మరోవైపు థియేటర్లలో అన్ని సౌకర్యాలు, టికెట్ల ధరలు సవ్యంగా ఉన్నాయో లేదో జిల్లా అధికారులు తనిఖీలు ముమ్మురంగా చేస్తున్నారు. థియేటర్లో తప్పక ఉండాల్సినవి ఇవే.. ►ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్, ఎలక్ట్రికల్ సర్టిఫికెట్ ►బిల్డింగ్ స్ట్రెంగ్త్‌ను తెలియజేసే ఆర్అండ్బీ అనుమతి ►ఫిలిమ్ డివిజన్ నుంచి అనుమతి పత్రం ►క్యాంటీన్ నిర్వహణ కోసం ఫుడ్‌లైసెన్స్ ►ఇవన్నీ రెవెన్యూ విభాగం వారికి సమర్పించి ‘ఫామ్–బి’సర్టిఫికెట్ పొందాలి. విచారణ చేస్తున్నాం హైకోర్టుని ఆశ్రయించామని చెప్పిన జిల్లాకి చెందిన 9 థియేటర్ల ఎగ్జిబిటర్లలో ఏడుగురు వారం రోజుల క్రితం తనకు ఫిర్యాదు చేశారు. తమకు అసలు విషయం చెప్పకుండా ఎగ్జిబిటర్ల అసోసియేషన్‌కి చెందిన చోడవరం థియేటర్ యాజమాని ఒకరు తమ దగ్గర సంతకాలు చేయించుకున్నారని చెప్పారు. ఇదంతా తమ ప్రమేయం లేకుండానే జరిగిందని, విచారణ చేయాలని కోరారు. ప్రభుత్వ జీవోకు తామంతా ఆమోదయోగమేనని కోర్టుకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని ఫిర్యాదులో తెలిపారు. – వేణుగోపాల్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ చదవండి: Vizag Beach: ఎక్కువ ప్రమాదాలు ఆ నెలల్లోనే! -
ఆన్లైన్ టికెట్ విధానంపై మంత్రి పేర్ని నాని సమీక్ష
విజయవాడ: ఆన్లైన్ పద్దతిలో సినిమా టికెక్టు అమ్మాలనే ప్రక్రియ 2002 నుంచి ఉందని సమాచారశాఖ మంత్రి పేర్నినాని అన్నారు. ఇందులో భాగంగా సినీ పరిశ్రమకు చెందిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల్ని ప్రభుత్వం నేడు చర్చకు పిలిచిందన్నారు. ఆన్లైన్ టికెట్ విధానంపై విజయవాడలో మంత్రి పేర్ని నాని సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతోపాటు దిల్ రాజు, డీఎన్వీ ప్రసాద్, ఆది శేషగిరి రావు, డీవీవీ దానయ్య హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఆన్లైన్ టికెట్ వ్యవస్థ, కరోనా వలన సిని పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఎగ్జిబిటర్ల సమస్యలు, నిర్మాతల సమస్యలు అన్నింటిని ప్రభుత్వం తరపున తాము నమోదు చేసుకున్నామని తెలిపారు. త్వరలోనే సినీ పరిశ్రమ సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించిన తర్వాత పరిష్కారం తీసుకుంటామన్నారు. ఆన్లైన్ టికెట్ వ్యవస్థ కు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రతినిధులు సానుకూలంగా ఉన్నారని, మళ్ళీ ఇంకోసారి సినిమా ప్రతినిధులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు సమావేశం అవుదామని తెలిపినట్లు పేర్కొన్నారు. సీఎం జగన్ ఎప్పుడు కూడా సాధారణ ప్రేక్షకులకు వినోదం అందుబాటులో ఉంచేలా చేస్తారని వెల్లడించారు. చదవండి: Youngest MPTC: చిన్న వయసులోనే.. ‘ఎంపీటీసీ’! -
కిల్ రాజు అంటావా..సినిమా ఎవడు ఇస్తాడు?
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజుపై డిస్టిబ్యూటర్ వరంగల్ శ్రీను చేసిన వ్యాఖ్యల్ని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తీవ్రంగా ఖండించారు. దిల్‌రాజు గురించి మాట్లాడే అర్హత శ్రీను లేదన్నారు. శనివారం ఆయన అల్లుడు అదుర్స్ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ.. ‘నైజాం డిస్ట్రిబ్యూటర్ శ్రీను అనే వ్యక్తి ఈరోజు దిల్ రాజు గురించి మాట్లాడుతున్నాడు. అసలు శ్రీను అనే వ్యక్తికి దిల్ రాజు గురించి మాట్లాడే అర్హత ఉందా? శిరీష్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత అసలే లేదు. వాళ్లతో మాకు 20 ఏళ్లుగా అనుబంధం ఉంది.. అసలు దిల్ రాజు-శిరీష్ అనేవాళ్లు నైజాం ఏరియాలో లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యుసర్ అనేవాళ్లే ఉండరు. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తున్నారు. వాళ్లు కనుక పక్కకు తప్పుకుంటే సినిమాలు చేయలేం బాబోయ్ అనే ప్రొడ్యుసర్లు ఉన్నారు. వాళ్లదగ్గరకు వెళ్లి సినిమా ఆగిపోతుంది.. రిలీజ్ కష్టంగా ఉంది అంటే ఎంత డబ్బు ఇచ్చి అయినా రిలీజ్ చేస్తారు. నాకు కూడా చాలా డబ్బు ఇచ్చారు. నాలా చాలామంది ఉన్నారు. (చదవండి : దిల్ రాజుపై ఫైరైన క్రాక్ డిస్ట్రిబ్యూటర్) ఇప్పుడేదో క్రాక్ డిస్ట్రిబ్యూటర్ శ్రీను మాట్లాడుతున్నాడు.. నేను ఆరేళ్లలో ఆరు సినిమాలు చేశాను అని. నువ్ ఆరు చేస్తే వాళ్లు వంద సినిమాలు చేశారు. మొత్తం ఎగ్జిబిటర్స్‌కి లైఫ్ ఇచ్చారు. ఈ సంక్రాంతికి మూడు సినిమాలు చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ థియేటర్స్‌కి రప్పించారు. అలాంటి డిస్ట్రిబ్యూటర్స్ మనకి కావాలి. శిరీష్-దిల్ రాజు అనే వ్యక్తులు లేకపోతే.. ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థే నాశనం అయిపోయేది. తెలిసీ తెలియక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. నేను హుషారు సినిమా చేశానంటున్నాడు. హుషారు సినిమా బెక్కం వేణుగోపాల్ అనే చిన్న నిర్మాత చేశారు. ఇప్పటికీ ఆయన డబ్బులు కోసం తిరుగుతూనే ఉన్నాడు. కనీసం జీఎస్టీ కూడా కట్టలేదట. అలాంటి వ్యక్తి నేను ఎడ్యుకేటెడ్, పవర్ ఫుల్ మేన్‌ని అని పక్కన ఓయూ జేఏసీ విద్యార్థుల్ని పెట్టుకుని మాట్లాడుతున్నాడు.ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్లు ఉన్నారు.. ఇండస్ట్రీ పుట్టకు ముందు నుంచి ఉన్నారు. అన్యాయం జరిగితే వాళ్ల దగ్గరకు వెళ్లొచ్చు.. బోలెడు అసోసియేషన్స్ ఉన్నాయి. బ్లాక్ మెయిల్ చేయడం కరెక్ట్. నీ సినిమాలో దమ్ము ఉంది. ఆడుతుంది.. నీ డబ్బు ఎక్కడికీ పోదు. నువ్ కనీసం జీఎస్టీ కట్టలేదు.. నీకు నెక్స్ట్ సినిమా ఎవడు ఇస్తాడు. ఇచ్చినా ఇలాగే ఉంటుంది. ఓయూ జేఏసీ వాళ్లకి చెప్తున్నా.. మీరు అన్నీ తెలుసుకుని ఇలాంటి జీఎస్టీ కట్టని వాళ్లకోసం మాట్లాడొద్దు. మీరు వెనకేసుకుని వస్తున్న ఆ వ్యక్తితో ముందు జీఎస్టీ కట్టించి.. అప్పుడు మాట్లాడండి. నేను ప్రెస్ మీట్ ఈ విషయం మాట్లాడాలని అనుకున్నా. కానీ సందర్భం కాదని అల్లుడు అదుర్స్ సక్సెస్ మీట్లో మళ్లీ చెప్తున్నా.. దిల్ రాజు, శిరీష్ లేకపోతే ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉండేది కాదు. ఆయనకి ఇంగ్లీష్ రాకపోతే నీకు ఎందుకు? తమిళ్ వస్తే నీకెందుకు? ఆయన మంచి సినిమాలు తీస్తున్నాడు. జనాలు ఆదరించే సినిమాలు చేస్తున్నాడు. అతన్ని పట్టుకుని కిల్ రాజు అంటావా? మేం వాళ్లతో 20 ఏళ్ల నుంచి బిజినెస్ చేస్తున్నాం.. ఇలాంటి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ఇండస్ట్రీలో ఉండాలి’ అని బెల్లంకొండ సురేష్ ఫైర్ అయ్యారు. కాగా, ఇటీవల క్రాక్ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను దిల్‌రాజు తనకు థియేటర్లు ఇవ్వడంలేదని మండిపడ్డ సంగతి తెలిసిందే. క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా తనకు థియేటర్లు ఇవ్వకుండా ‘మాస్టర్’ సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇచ్చారని అసహనం వ్యక్తం చేశాడు. దిల్ రాజు నియంతలా వ్యవహరిస్తూ.. డిస్ట్రిబ్యూటర్స్‌ని బానిసలుగా చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. -
దిల్ రాజుపై ఫైరైన క్రాక్ డిస్ట్రిబ్యూటర్
సంక్రాంతి పండుగ అంటే పిండి వంటకాలు, కోళ్ల పందేలతో పాటు కొత్త సినిమాల సందడి కూడా. ముఖ్యమైన పండగ సీజన్లలో స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు నిండిపోతాయి. ఈ క్రమంలో చిన్న సినిమాలకు థియేటర్లు దొరకక ఆయా సినిమాల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బందులు పడతారు. అందుకే సంక్రాంతి, దసరా వంటి పెద్ద పండుగలు వస్తే చాలు థియేటర్ల ఇష్యూ ఎక్కువగా ఉంటుంది. బడా నిర్మాతలైన దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్‌ల గుప్పిట్లోనే ఎక్కువగా థియేటర్స్ ఉన్నాయంటూ చిన్న నిర్మాతలు ఆరోపిస్తుంటారు. వీరి వల్ల చిన్న సినిమాల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నామంటూ వాపొతుంటారు. ఈ నేపథ్యంలో ఈ పండగకు వరంగల్‌కు చెందిన క్రాక్ డిస్ట్రిబ్యూటర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ సంక్రాంతికి ముందుగా మాస్ మహారాజ రవితేజ ‘క్రాక్’ సినిమా విడులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాను డిస్ట్రిబ్యూట్ చేసిన ‘క్రాక్’ సినిమాకు సరైన థియెటర్లు ఇవ్వలేదంటూ వరంగల్‌కు చెందిన శ్రీను అనే డిస్ట్రిబ్యూటర్ నిర్మాత దిల్ రాజు తీరుపై మండిపడ్డారు. (చదవండి: కేక పుట్టిస్తోన్న ‘వకీల్ సాబ్’ టీజర్.. ఆ డైలాగ్‌లో..) ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. సంక్రాంతికి విడుదలైన రవితేజ క్రాక్ సినిమాకు మంచి టాక్ వచ్చిందని, బాగా నడుస్తోన్న ఈ చిత్రానికి థియేటర్లు బాగా తగ్గించేసి డబ్బింగ్ సినిమా అయిన విజయ్ ‘మాస్టర్’ సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇచ్చారని దిల్ రాజుపై అసహనం వ్యక్తం చేశారు. అందుకే దిల్ రాజు పేరును కిల్ రాజుగా మర్చాలని మండిపడ్డారు. అయితే గతంలో హీరో రజినీకాంత్ ‘దర్బార్’ ‘పేట’ వంటి తమిళ డబ్బింగ్ సినిమాల విడుదలపై దిల్ రాజు సంక్రాంతికి తెలుగు స్ట్రెయిట్ సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. డబ్బింగ్ సినిమాలకు ఎలా థియోటర్లు ఇస్తామని ప్రశ్నించిన ఆయనే ఇప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. ఆయన మాట్లాడిన దానికి పూర్తి భిన్నంగా ‘క్రాక్’ వంటి తెలుగు సినిమాకు ప్రాధాన్యత ఇవ్వకుండా డబ్బింగ్ మూవీ ‘మాస్టర్’కు ప్రాధాన్యత ఇచ్చారని ఆయన ఆరోపించారు. తాను డిస్ట్రిబ్యూట్ చేస్తోన్న క్రాక్ సినిమాకు ఒకవేళ టాక్ బాగాలేకపోయినట్టైయితే.. తాను మాట్లాడేవాడిని కాదని, కానీ క్రాక్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ అనిపించుకుందన్నారు. అలాంటి మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమాను సడెన్‌గా థియేటర్స్లోంచి లేపేశారంటూ అతడు అవేదన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: థియేటర్‌కి వెళితే కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోతాం) -
దర్బార్ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు నష్టమా?
పెరంబూరు : దర్బార్ చిత్రం బయ్యర్లకు సుమారు రూ.20 కోట్లు నష్టం తెచ్చిపెట్టిందన్న వదంతులు ప్రచారమవుతున్నాయి. నష్టాన్ని భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బయ్యర్లు శుక్రవారం చెన్నైలోని రజనీకాంత్ ఇంటికి చేరుకున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం గత నెల 8వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. విడుదలైన నాలుగు రోజులకే దర్బార్ చిత్రం 100 కోట్లు వసూలు చేసిందని ప్రచారం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో కొందరు బయ్యర్లు దర్బార్ చిత్రం నష్టాన్ని తెచ్చిపెట్టిందని ప్రచారం సాగిస్తున్నారు. దర్బార్ చిత్రాన్ని దక్షిణ జిల్లాల హక్కులను మదురైకి చెందిన ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కొనుగోలు చేశాడు. దర్బార్ చిత్రం తనకు రూ.20 కోట్ల నష్టం వాటిల్లిందని చెబుతూ ఆ చిత్రానికి సంబంధించిన కలెక్షన్ల వివరాలను తీసుకుని చెన్నైకి చేరుకున్నారు. దర్బార్ చిత్రాన్ని డిస్టిబ్యూటర్లు మినిమమ్ గ్యారెంటీ విధానంతో కొనుగోలు చేశారు. కొందరు బయ్యర్లు లైకా ప్రొడక్షన్స్ కార్యాలయానికి వెళ్లి తమకు నష్టం వచ్చిందని మొరపెట్టుకున్నారు. లైకా సంస్థ నిర్వాహకులు తమకే రూ.40 కోట్లు నష్టం ఏర్పడినట్లు తెలిపిందని చెబుతూ దర్శకుడు ఎ.ఆర్.మురగదాస్ రూ.60 కోట్లు పారితోషికం తీసుకున్నారని, ఆయన్ను వెళ్లి అడగండి అని పంపించినట్లు సమాచారం. ఆ బయ్యర్లు మురుగదాస్ ఇంటికి వెళ్లగా, అక్కడ ఆయనకు సంబంధించిన వ్యక్తులు మురుగదాస్ లైకా సంస్థ అల్లు అర్జున్ హీరోగా నిర్మిస్తున్న చిత్ర షూటింగ్‌కు వెళ్లారని చెప్పారు. దీంతో రజనీకాంత్ ఇంటికి చేరుకున్నారు. విషయం తెలిసిన మీడియా అక్కడికి చేరుకుంది. మీడియాను చూసిన ఆ బయ్యర్లు అక్కడకు ఎందుకువచ్చామన్న బదులు చెప్పకుండా జారుకున్నారు. మొత్తం మీద దర్బార్ చిత్ర వ్యవహారం వివాదాస్పదంగా మారింది. నటుడు రజనీకాంత్ ఇటీవల కర్ణాటక రాష్ట్రం మైసూర్ సమీపంలోని బందీపురంలో నటించిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ డాక్యుమెంట్ చిత్రం వచ్చే ఏప్రిల్‌లో డిస్కవరీ ప్రచారం కానున్నట్టు తెలిసింది. -
హెరిటేజ్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ఆత్మహత్య
సాక్షి, దర్శిటౌన్: హెరిటేజ్ కంపెనీలో పనిచేస్తున్న ఓ డిస్ట్రిబ్యూటర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కంపెనీ తనను అకారణంగా తొలగించడంతోనే అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరానికి చెందిన గంగినేని హరిబాబు(48) 2012లో హెరిటేజ్‌కు చెందిన పాలు, సంబంధిత పదార్థాల సీ అండ్ ఎఫ్ (కారీయింగ్ అండ్ ఫార్వార్డింగ్) డిస్ట్రిబ్యూటర్‌గా చేరాడు. రూ.2.8 లక్షలు కూడా డిపాజిట్ చేశాడు. ఒంగోలు నగరంలో ఉంటున్న ఆయన.. కంపెనీ తనకు సరఫరా చేస్తున్న పాలు ఇతర పదార్థాలను ఏజెంట్లకు సరఫరా చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదనంగా డిపాజిట్ చెల్లించకపోవడం తదితర కారణాలతో పాల పదార్థాల సరఫరా నిలిపివేస్తున్నట్టు హరిబాబుకు జనవరి 5న కంపెనీ నుంచి మెయిల్ అందింది. కంపెనీ పెద్దలను బతిమాలుకున్నా ఫలితం లేకపోవడంతో మర్నాడే నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలకు లేఖ రాశాడు. తనను ఆపేస్తే ఆర్థికంగా ఇబ్బందిపడతానని లెటర్లో వేడుకున్నాడు. ఇతర కంపెనీలతో పోల్చితే హెరిటేజ్‌లో తక్కువప్రోత్సాహకం ఇస్తున్నా టీడీపీపై అభిమానంతోనే పనిచేస్తున్నట్టు పేర్కొన్నాడు. ఆ ఉత్తరానికి కంపెనీ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. బకాయిలు ఆగిపోవటం, డిపాజిట్ వెనక్కు ఇవ్వకపోవడంతో బయట ముఖం చూపించలేకపోతున్నానని, ఆత్మహత్యే శరణ్యమని లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. కంపెనీ తనను తీసేయడంతో అప్పుల పాలై చివరికి తన 3.5 ఎకరాల పొలం అమ్మి కొంతమేర బాకీలు తీర్చాడు. ఈ నేపథ్యంలో శనివారం స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆదివారం ఉదయం ఇంటి ముందు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. బంధువులు అద్దంకిలోని ఆస్పత్రికి తరలించగా> అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. ఘటనాస్థలంలో లభించిన ఆనవాళ్లను బట్టి మద్యంలో పురుగు మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు చెబుతున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. దీనిపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. -
నెలకు రూ.4,499 కట్టి, ఐఫోన్ 10ఎస్ పొందండి
టెక్ దిగ్గజం ఆపిల్‌కు భారత్‌లో ఉన్న అధికారిక డిస్ట్రిబ్యూటర్స్‌లో ఇండియాస్టోర్.కామ్ ఒకటి. ఈ అధికారిక వెబ్సైట్లో ఆపిల్ ఇటీవల లాంచ్ చేసిన ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్ స్మార్ట్ఫోన్లు లో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌తో కొనుగోలుకు అందుబాటులోకి వస్తున్నాయి. ఎయిర్టెల్, జియో, ఫ్లిప్‌కార్ట్‌లలో కూడా వీటిని విక్రయానికి ఉంచుతుంది ఆపిల్. ఆసక్తి గల కస్టమర్లు ముందస్తుగా ఈ ఫోన్లను బుక్చేసుకోవాలని ఆపిల్ తెలిపింది. ఈ సందర్భంగా ఇండియాస్టోర్.కామ్ ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. నెలకు రూ.4,999 చొప్పున 24 నెలల పాటు చెల్లించి, ఐఫోన్ 10ఎస్(64జీబీ) వేరియంట్‌ను సొంతం చేసుకోవచ్చని తెలిపింది. దీనిపై విధించే వడ్డీరేటు అనంతరం ఐఫోన్ 10ఎస్( జీబీ) ధర రూ.99,900 నుంచి రూ.1,07,976కు పెరుగుతుందని పేర్కొంది. అదేవిధంగా ఐఫోన్ 10ఎస్(256జీబీ) వేరియంట్‌ను కూడా 24 నెలల పాటు నెలకు రూ.5,175 చెల్లించి కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది. దీనిపై విధించే వడ్డీరేటుతో కూడా ఐఫోన్ 10ఎస్(256జీబీ) వేరియంట్ ధర కూడా రూ.1,14,900 నుంచి రూ.1,24,200కు పెరుగుతుందని తెలిపింది. ఐఫోన్ 10ఎస్(512జీబీ) వేరియంట్ కూడా నెలకు రూ.6,076 చెల్లించడంతో కొనుగోలుదారులకు సొంతమవుతుంది. మిగతా మొత్తాన్ని 24 నెలల్లో చెల్లించాలి. అదేవిధంగా ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్ 64జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లను కూడా నెలకు 4,999 రూపాయలు, 5,678 రూపాయలు, 6,587 రూపాయలు చొప్పున 24 నెలల పాటు చెల్లించి తమ సొంతం చేసుకోవచ్చు. సెప్టెంబర్ 28 నుంచి ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్‌లు భారత్‌లో కొనుగోలుకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ రెండు హ్యాండ్సెట్లను విడుదల చేయడానికి ఇండియాస్టోర్ సైట్ కౌంట్‌డౌన్ కూడా ప్రారంభించింది. 24 నెలల టెన్యూర్‌తో లో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను ఇండియాస్టోర్.కామ్ అందుబాటులోకి తెచ్చింది. వీటిపై యాక్సిస్‌బ్యాంక్ క్రెడిట్ కార్డు, సిటీ క్రెడిట్ కార్డులు అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేయనుంది. నాన్-ఈఎంఐ లావాదేవీలకు ఐదింతల రివార్డు పాయింట్లు లభిస్తాయి. లావాదేవీ జరిపిన 150 బిజినెస్ గంటల్లో క్యాష్‌బ్యాక్ కొనుగోలుదారులకు అందుతుంది. -
వెండితెరపై చినబాబు 'ఆట'
కలెక్షన్ల పంపకంపై తీవ్ర వివాదం.. మూడు జిల్లాల్లో మల్టీప్లెక్స్‌ల్లో నిలిచిన తెలుగు సినిమాల ప్రదర్శన 50 శాతమే ఇస్తున్న యాజమాన్యాలు.. 60 శాతం ఇవ్వాల్సిందేనంటున్న డిస్ట్రిబ్యూటర్లు తెలంగాణ తరహా విధానాన్ని వర్తింపజేయాలని విజ్ఞప్తి.. యాజమాన్యాలకు అండగా టీడీపీ యువనేత తాము చెప్పింది చేయాలంటూ విజయవాడ టీడీపీ ప్రజాప్రతినిధి హెచ్చరిక అమరావతి : రాష్ట్రంలో సినిమా రంగాన్ని గుప్పిట పట్టాలన్న చినబాబు ఆరాటం డిస్ట్రిబ్యూటర్లకు సంకటప్రాయంగా మారుతోంది. అస్మదీయులకు చెందిన మల్టీప్లెక్స్‌లకు అండగా డిస్ట్రిబ్యూషన్ రంగాన్ని దెబ్బతీసేందుకు ఆయన రంగంలోకి దిగారు. ఫలితంగా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మల్టీప్లెక్స్‌ల్లో కొన్నిరోజులుగా తెలుగు సినిమాల ప్రదర్శన నిలిచిపోయింది. సినిమాల కలెక్షన్ల వాటాల అంశంలో తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లు, మల్టీప్లెక్స్ యజమానుల మధ్య కొన్నేళ్లుగా విభేదాలు ఉన్నాయి. కలెక్షన్లలో తమకు 60 శాతం ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు. మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలు 50 శాతమే ఇస్తుండటం వివాదానికి దారితీసింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఈ వివాదాన్ని పరిష్కరించింది. డిస్ట్రిబ్యూటర్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాల మధ్య మొదటివారం 55 శాతం: 45 శాతం, రెండోవారం 60:40, మూడు, నాలుగు వారాలు 65శాతం: 35శాతంగా కలెక్షన్లు పంచుకోవాలని ఖరారు చేసింది. ఏపీలో కూడా ఇదే విధానాన్ని వర్తింపజేయాలని డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నారు. ఏపీ ప్రభుత్వం పరోక్షంగా మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు కొమ్ముకాస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విశాఖపట్నంలో డిస్ట్రిబ్యూటర్లు ఇటీవల ‘జనతా గ్యారేజ్’ సినిమాను మల్లీప్లెక్స్‌ల్లో విడుదల చేయబోమని హెచ్చరించారు. దాంతో మొదటివారం 53 శాతం ఇచ్చేందుకు యాజమాన్యాలు సమ్మతించాయి. చినబాబు రంగ ప్రవేశం... విశాఖపట్నం తరçహాలో కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా 53 శాతాన్నే వర్తింపజేయాలని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు కోరారు. అందుకు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు నిరాకరించాయి. యాజమాన్యాలకు అండగా చినబాబు రంగ ప్రవేశం చేశారు. దీర్ఘకాల రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం సినిమా రంగాన్ని గుప్పిటపట్టాలని ఆయన వ్యూహం రచించారు. అందుకే అస్మదీయులైన మల్టీప్లెక్స్ యజమానులకు అండగా నిలిచారు. సినిమాల ప్రదర్శన విషయంలో తాము చెప్పింది చేయాలంటూ చినబాబు ఆదేశాల మేరకు విజయవాడకు చెందిన ఓ టీడీపీ ప్రజాప్రతినిధి డిస్ట్రిబ్యూటర్లను హెచ్చరించినట్లు సమాచారం. వివాదం సంక్లిష్టంగా మారడంతో కొన్ని రోజులుగా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మల్టీప్లెక్స్‌ల్లో తెలుగు సినిమాల ప్రదర్శన నిలిచిపోయింది. 53% కనీసం ఇవ్వండి.. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మల్టీప్లెక్స్‌ల్లో 50కి పైగా స్కీన్లు ఉన్నాయి. వాటిలో సినిమాల ప్రదర్శన వల్ల రోజుకు దాదాపు రూ.కోటి కలెక్షన్ వస్తోందని అంచనా. డిస్ట్రిబ్యూటర్లకు మొదటివారం కలెక్షన్లలో 50 శాతం.. అంటే రోజుకు రూ.50 లక్షలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం డిస్ట్రిబ్యూటర్లు, మల్లీప్లెక్స్‌ల యాజమాన్యాల మధ్య మొదటివారం 50 శాతం: 50 శాతం, రెండోవారం 55:45, మూడోవారం 60:40, నాలుగోవారం 65 శాతం: 35 శాతం చొప్పున కలెక్షన్లు పంపిణీ చేస్తున్నారు. 90 శాతం సినిమాలను మల్టీప్లెక్స్‌ల్లో మొదటి వారమే ప్రదర్శిస్తారు. కలెక్షన్లు బాగున్నాసరే తీసివేస్తారు. మల్టీప్లెక్స్‌ల్లో తమకు ఎక్కువ వాటా వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో సినిమాలే ప్రదర్శించడం లేదని డిస్ట్రిబ్యూటర్లు ఆరోపిస్తున్నారు. మొదటివారం కలెక్షన్లలో కనీసం 53 శాతం అయినా ఇప్పించాలని కోరుతున్నారు. 60% ఇచ్చినా తక్కువే.. ‘‘మల్టీప్లెక్స్‌లు సినిమాల ప్రదర్శనతోపాటు ఇతర వ్యాపారాలతో కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాయి. సినిమా కలెక్షన్లలో డిస్ట్రిబ్యూటర్లకు 60 శాతం ఇచ్చిన తక్కువే అవుతుంది. ప్రభుత్వ పెద్దలు మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు కొమ్ముకాయడం దారుణం’’ – నట్టికుమార్, పంపిణీ రంగ ప్రముఖుడు -
పూరీ జగన్నాథ్ పై డిస్ట్రిబ్యూటర్ల దాడి
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పై కొందరు డిస్ట్రిబ్యూటర్లు దాడిచేసిన సంఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ సామల వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సి.కల్యాణ్ నిర్మాతగా పూరీ జగన్నాథ్ దర్శకుడిగా ఇటీవల ‘లోఫర్’ సినిమా రూపొందించారు. ఈ సినిమా నైజాం, సీడెడ్, ఆంధ్ర డిస్ట్రిబ్యూటింగ్ హక్కులను అభిషేక్, సుధీర్, ముత్యాల రాందాస్ అనే డిస్ట్రిబ్యూటర్లుగా కొనుగోలు చేశారు. సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. డిస్ట్రిబ్యూటర్లకు తీవ్రంగా నష్టాలు రావడంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఈ ముగ్గురూ గత కొద్ది రోజుల నుంచి దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై ఒత్తిడి తెస్తున్నారు. అయితే, ఈ సినిమాకు తాను నిర్మాతను కాదని తనకేం సంబంధం లేదంటూ పూరీ బదులు చెప్పినా వీరు వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 14వ తేదీన రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ -34లో ఉన్న పూరీ జగన్నాథ్ కార్యాలయానికి వచ్చిన అభిషేక్, సుధీర్, ముత్యాలరాందాస్ లు డబ్బులు ఇవ్వాలంటూ పూరీని బెదిరించారు. ఆ క్రమంలోనే పూరీపై దాడి కూడా చేసినట్లు తెలిసింది. దర్శకుడి కుటుంబ సభ్యులను సైతం నిందితులు భయభ్రాంతులకు గురిచేసినట్లు సమాచారం. దౌర్జన్యానికి పాల్పడ్డ ముగ్గురిని ఆపేందుకు పూరీ యత్నించినా ఫలితం లేకుండాపోయింది. కాగా, తన కార్యాలయంపై డిస్ట్రిబ్యూటర్లు దాడిచేశారంటూ పూరీ జగన్నాథ్ శనివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. ఈ మేరకు నిందితులపై ఐపీసీ సెక్షన్ 506, 452, 323, 452, 386, రెడ్‌విత్ 511 కింద కేసులు నమోదయ్యాయి. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.