Vijay Devarakonda Meets Fan Girl Who Has His Tattoo Video Goes Viral - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: అభిమానంతో వీపుపై విజయ్‌ దేవరకొండ టాటూ.. ఫ్యాన్‌ ఎమెషనల్‌

Published Fri, Jul 1 2022 1:52 PM | Last Updated on Fri, Jul 1 2022 3:38 PM

Vijay Devarakonda Meets Fan Who Has His Tattoo Video Viral - Sakshi

Vijay Devarakonda Meets Fan Who Has His Tattoo Video Viral: సినీ నటీనటులను ప్రేక్షకులు ఎంతగానే అభిమానిస్తారు, ఆరాధిస్తారు. వారిని చూసిన, వారిని కలిసినా ఎక్కడలేని విధంగా ఎమోషనల్‌ అవుతారు. వారి ఆనందానికి అవధులు లేవని ఆనందభాష్పాల ద్వారా తెలియజేస్తారు. ఇలాంటి సంఘటన తాజాగా జరిగింది. తన అభిమాన హీరోను చూసిన ఆ ఫ్యాన్ భావోద్వేగానికి లోనయ్యారు. అతన్ని కలుసుకుని మాట్లాడటంతో సంతోషం పట్టలేక కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఆ హీరో ఎవరో కాదు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ. 

విజయ్‌కు వీరాభిమాని అయిన చెర్రీతో పాటు మరో ఫ్యాన్‌ సోనాలి ఈ రౌడీ హీరోను కలిశారు. ఆ ఇద్దరితో సరదాగా ముచ్చటించి, కలిసి ఫొటోలు దిగాడు విజయ్‌ దేవరకొండ. అదే చోట ఉన్న డ్యాషింగ్‌ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మినీ వారిద్దరికి పరిచయం చేశాడు. తన వీపుపై విజయ్‌ దేవరకొండ టాటూతో అభిమానాన్ని చాటుకున్నారు చెర్రీ. ఈ క్రమంలోనే ఆనందభాష్పాలతో తన సంతోషాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం 'లైగర్‌' ఆగస్టు 25న విడుదల కానుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement