మెగాస్టార్‌తో సెల్ఫీ కోసం యత్నం.. ఇలా చేశారేంటి? | Megastar Chiranjeevi Pushed The Staff Who Tried To Come Near Him And Take A Selfie | Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi: మెగాస్టార్‌తో సెల్ఫీ కోసం యత్నం.. నెటిజన్స్‌ ఆగ్రహం!

Published Tue, Jul 30 2024 2:50 PM | Last Updated on Tue, Jul 30 2024 4:10 PM

Megastar Chiranjeevi Throws A Man Trying To Selfie In Airport

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార్ ఫేమ్ వశిష్ట డైరెక్షన్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే షూటింగ్‌కు కాస్తా గ్యాప్ ఇచ్చిన  మెగాస్టార్‌ పారిస్ ఒలింపిక్స్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. తన ఫ్యామిలీతో కలిసి పారిస్ చేరుకున్న చిరంజీవి అక్కడి వీధుల్లో సందడి చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.

అయితే తాజాగా మెగాస్టార్‌ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. అదే సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న చిరంజీవితో అక్కడే ఉన్న కొందరు సిబ్బంది సెల్పీలు దిగేందుకు యత్నించారు. అందులో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ వ్యక్తి మెగాస్టార్‌తో సెల్ఫీ కోసం ఎగబడ్డాడు. అయితే సెల్ఫీ కోసం వచ్చిన సిబ్బందిని మెగాస్టార్‌ పక్కకు తోసేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఒక అభిమాని పట్ల ఇలా వ్యవహరించడం సరైంది కాదని కొందరు నెటిజన్స్‌ మండిపడుతున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement