Suriya Pays Emotional Tribute To His Fan Girl Aishwarya, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Suriya Tribute To Fan Girl: కాల్పుల్లో అభిమాని మృతి.. సూర్య భావోద్వేగ లేఖ

Published Sat, May 20 2023 1:51 PM | Last Updated on Sat, May 20 2023 3:09 PM

Suriya Pays Emotional Tribute To His Fan Aishwarya - Sakshi

ఇటీవల టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో తాటికొండ ఐశ్వర్య అనే యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే. అమెరికా కాలమానం ప్రకారం ఈ నెల 7న మధ్యాహ్నం టెక్సాస్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌లోకి ఓ దుండగుడు చొరబడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఐశ్వర్యతో పాటు మరో ఏడుగురు మృతి చెందారు. హీరో సూర్యకి ఐశ్వర్య పెద్ద అభిమాని.

(చదవండి: యుద్ధ భూమిలో కలుద్దాం తారక్‌.. హృతిక్‌ రోషన్‌ ట్వీట్‌ వైరల్‌ )

తన అభిమాని చనిపోయిందన్న విషయం తెలుసుకున్న సూర్య భావోద్వేగానికి లోనయ్యాడు. ఆమె మృతి పట్ల విచారం వ్యక్తం చేశాడు. అనంతరం ఐశ్వర్య కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ లేఖను రాశాడు.  ‘మిమ్మల్ని(ఐశ్వర్య పేరెంట్స్‌) ఓదార్చడానికి నాకు మాటలు రావడం లేదు. ఐశ్వర్య మృతి మనకు తీరని లోటు. ఆమె ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో బతికే ఉంటుంది’ అంటూ ఐశ్వర్య తల్లిదండ్రును ఓదార్చాడు. అలాగే ఐశ్వర్య గురించి రాస్తూ.. ‘నువ్వు నిజమైన హీరోవి. నువ్వు చిందించే నవ్వు.. ప్రేమను పంచే నీ గుణం.. ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతుంది’ అని రాసుకొచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement