అభిమానిపై చెయ్యి చేసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ | MLA Nandamuri Balakrishna Slapped Fan At Election Campaign In Sri Sathya Sai District - Sakshi
Sakshi News home page

దబ్బిడి దిబ్బిడి షురూ.. అభిమానిపై చెయ్యి చేసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ

Published Sat, Apr 13 2024 10:57 AM | Last Updated on Sat, Apr 13 2024 1:39 PM

MLA Nandamuri Balakrishna Slapped Fan At Election Campaign - Sakshi

సెల్ఫీ అడిగితే ఒక్కటిచ్చాడు

సాక్షి, సత్యసాయి: ఎన్నికల ప్రచారం మొదలుపెట్టక ముందే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తన శైలిలో దబ్బిడి దిబ్బిడి షురూ చేసేశారు. సహనం కోల్పోయి ఓ అభిమానిపై చెయ్యి చేసుకున్నారు. శనివారం ఉదయం సత్యసాయి జిల్లాలో ఈ ఘటన జరిగింది.

ఇవాళ్టి నుంచి బాలయ్య  బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం మొదలుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెలికాఫ్టర్‌లో కదిరికి ఆయన చేరుకున్నారు. ఆయన ల్యాండ్‌ కాగానే అభిమానులు కొందరు ఆయన దగ్గరికి వచ్చారు. ఈ క్రమంలో ఓ అభిమాని సెల్ఫీ కోసం యత్నించగా.. బాలయ్య సహనం కోల్పోయారు. ఆ అభిమానిపై చెయ్యి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా అభిమానులపైనా ఆగ్రహం ప్రదర్శించారు. పక్కనే ఉన్న నేతలు సైతం ఆ అభిమానిని దూరంగా నెట్టేశారు.

ఇదీ చదవండి: బాలయ్య కోపం ఎవరి మీద?.. అభిమానులు జర జాగ్రత్త!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement