
హీరో అజిత్‌ది సినీ రంగంలో ప్రత్యేక స్థానం. నటుడుగా ఉన్నత స్థానంలో ఉన్న ఆయన వివాద రహితుడు. తానేంటో తన పని ఏంటో అన్నట్టుగా ఉంటారు. సినిమా రంగంలో జరిగే విషయాల గురించి అస్సలు పట్టించుకోరు. తన చిత్రాల విషయంలో కూడా ఏ ఇతర చిత్రాలతో పోటీగా భావించరు. అదే విధంగా ఇతర స్టార్ నటుల మాదిరిగా అభిమాన సంఘాలను ఇష్టపడరు. అభిమాన సంఘాల పేరుతో తమ సమయాన్ని వృథా చేసుకోవద్దని, తమ కుటుంబంపై ప్రేమాభిమానాలు చూపుతూ జీవితంలో ఎదగాలని తన అభిమానులకు సూచిస్తారు.
చదవండి: అద్దె ఇంట్లో ఉండేవాళ్లం, రెంట్ కట్టలేక 2 నెలలకో ఇళ్లు మారేవాళ్లం: రష్మిక
అలాంటి అజిత్ చాలా కాలం తరువాత అభిమానుల కోసం ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో అభిమానులను ఉద్దేశించి ‘మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రోత్సహించే వారిని స్పూర్తినిచ్చే వారిని మీ చుట్టూ ఉంచుకోండి.. ఎలాంటి వ్యతిరేక ఆలోచనలు, అనవసర విషయాల జోలికి పోకండి. మీ లక్ష్య సాధనలో ముందుకు సాగుతూ ఉన్నత స్థాయికి చేరుకోండి. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి. ఇది మంచి వాళ్ల కాలం. నిజాయితీగా నడుచుకోండి. మీలోని ప్రతిభను చాటుకోండి. మంచిగా జీవించండి.. జీవించనీయండి’ అని అజిత్ పేర్కొన్నారు. అయితే ఆయన సడన్‌గా ఇలాంటి ప్రకటన చేయడానికి కారణం ఏమిటన్న చర్చ జరుగుతోంది. కాగా అజిత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం తుణివు.
చదవండి: కాబోయే భర్తను పరిచయం చేసిన తమన్నా! షాకవుతున్న నెటిజన్లు
వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌జెయింట్ మూవీస్ సంస్థ తమిళనాడులో విడుదల చేస్తోంది. అదే విధంగా నటుడు విజయ్ హీరోగా నటించిన వారీసు చిత్రం కూడా అదే సమయానికి తెరపైకి రాబోతుంది. సాధారణంగా వీరి సినిమాలు వేర్వేరు తేదీల్లో విడుదలైతేనే వారి అభిమానులు రచ్చ.. రచ్చ చేస్తారు. అలాంటిది చాలా కాలం తరువాత విజయ్, అజిత్ నటించిన చిత్రాలు ఒకేసారి తెరపైకి రాబోతున్నాయి. దీంతో ఎలాంటి గొడవలు జరగకూడదని అజిత్ తన అభిమానులకు ఇలాంటి ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.
— Suresh Chandra (@SureshChandraa) November 17, 2022
Comments
Please login to add a commentAdd a comment