రెక్కలు లేని ఫ్యాన్‌.. అంతేనా అదిరిపోయే మరో స్పెషాలిటీ కూడా.. | Unique Fan Works Like Conditioner Invented By Toronto University Scholar Canada | Sakshi
Sakshi News home page

రెక్కలు లేని ఫ్యాన్‌.. అంతేనా మరో సూపర్‌ స్పెషాలిటీ కూడా ఉందండోయ్‌ !

Published Sun, Aug 22 2021 2:33 PM | Last Updated on Sun, Aug 22 2021 3:52 PM

Unique Fan Works Like Conditioner Invented By Toronto University Scholar Canada - Sakshi

రెక్కల్లేని మొండి ఫ్యాను చక్కనిదెలా అవుతుందనేగా మీ డౌటు? ఇది చూడచక్కనిది అవునో, కాదో ఈ ఫొటో చూసి మీరే తేల్చుకోవాలి గానీ, దీని పనితీరు మాత్రం చక్కగానే ఉంటుంది. పనులు చేసుకునే డెస్క్‌ మీద, లేదా ఏదైనా టేబుల్‌ మీద సులువుగా ఇమిడిపోయే ఈ ఫ్యాన్‌ భేషుగ్గా మనం కోరుకున్న రీతిలో గాలి వీస్తుంది. వాతావరణం వేడిగా ఉంటే, చల్లనిగాలులు వీస్తుంది, వాతావరణం చల్లగా ఉంటే వెచ్చనిగాలులు వీస్తుంది.

దాదాపుగా ఎయిర్‌కండిషనర్‌ మాదిరిగా పనిచేస్తుంది ఈ రెక్కల్లేని ఫ్యాను. దీనిని కెనడాలోని టొరంటో యూనివర్సిటీ రీసెర్చ్‌ అసిస్టెంట్‌ సోయంగ్‌ ఏన్‌ రూపొందించారు. ‘ఫ్లోడెస్క్‌ ఫ్యాన్‌’ పేరిట తయారు చేసిన ఈ ఫ్యాన్‌ గది వాతావరణానికి అనువుగా గాలులు వీచడమే కాదు, గాలిలోని దుమ్ము ధూళికణాలను పీల్చేసుకుని, స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement