Toronto University
-
ఆ ఒక్క కామెంట్ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది..!
21 ఏళ్ల ధన్య సోజన్ వధువుగా నటించిన యాడ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. బాలీవుడ్ పర్సనాలిటీలతో మొదలు అందరూ ఆమెను మెచ్చుకుంటున్నారు. ఎందుకు? ధన్య చావుతో పోరాడుతోంది. చావును గెలవాలనుకుంటోంది. కేవలం 20 శాతం గుండె పని తీరు కలిగి, వెంట్రుకలు పూర్తిగా కోల్పోయిన స్థితి నుంచి అందమైన పెళ్లికూతురిగా మారడం ఇటీవలి గొప్ప కుతూహలపు కథ. 28 ఆగస్టు 2019లో ధన్య సోజన్ టొరెంటో (కెనడా)లో దిగింది. అక్కడ రెండేళ్లు పోస్ట్ డిప్లమో కోర్సు ఆమె చదవాలి. కేరళ ఇడుక్కి జిల్లాలోని తోడపుజ అనే చిన్న టౌన్ ఆమెది. తండ్రి జోసఫ్ మిల్క్‌బూత్ నడుపుతాడు. తల్లి శాంతి గృహిణి. హైస్కూల్లో చదివే ఒక తమ్ముడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి చదువు మీద ఆసక్తి ఉన్న ధన్య బాగా చదువుకుని కెనడాలో సీటు సంపాదించుకుంది. కొన్ని నెలలు బాగా జరిగాయి. సెమిస్టర్లు రాసింది. కాని 2020 ఆగస్టు నాటికి ఆమె వూరికూరికే స్పృహ తప్పి పడిపోవడం మొదలెట్టింది. అక్కడి డాక్టర్లు చూసి మొదట నిమోనియా అనుకున్నారు. కాని రిపోర్టులు చూసి ఆమెకు ‘కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్’ ఉందని తేల్చారు. ప్రమాదకరమైన గుండెజబ్బు. ఏ క్షణం ఏమైనా కావచ్చు. గుండె మార్పిడి తప్ప వేరే మార్గం లేదు. భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ధన్య. ఊరుగాని ఊరు. దేశం కాని దేశం. ఇప్పుడు ఏం చేయాలి? హాస్పిటల్ రోజులు 20 ఏళ్ల హుషారైన అమ్మాయి ధన్య. ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఎన్ని రోజులు ఉండాలో తెలియదు. ఆమెకు ఆక్సిజన్ సరిగా అందడం లేదు. జుట్టు కొన్నాళ్లు నిలవదని చెప్పారు. ఉన్న జుట్టును పూర్తిగా తొలగించారు. ఆమె స్టూడెంట్ వీసా మీద రావడం వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ ఉపయోగించుకునే వీలు లేదు. అలాగని ఇంటినుంచి డబ్బు తెప్పించుకోలేదు. దారుణమైన పరిస్థితిలో పడింది ధన్య. అదృష్టం... ఆమె చేరిన హాస్పిటల్లో కేరళ నుంచి వచ్చిన నర్స్‌లు పని చేస్తున్నారు. వారు ధన్యను ఆదుకున్నారు. ధైర్యం చెప్పారు. ధన్య పరిస్థితిని టొరెంటోలో ఉన్న మలయాళీ సంఘం ‘హృదయపూర్వం’కు తెలియచేశారు. హృదయపూర్వం వెంటనే ధన్య కోసం ఫండ్ రైజింగ్ మొదలెట్టింది. దాదాపు లక్షన్నర డాలర్లు (కోటి రూపాయలు) కలెక్ట్ అయ్యాయి. హాస్పిటల్ బిల్ అందులో నుంచే కట్టారు. అయితే సమస్య అదుపులో ఉంది కాని ట్రీట్మెంట్ కొనసాగాల్సి ఉంది. ఇండియాలో ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్పారు. ఈలోపు హాస్పిటల్, యూనివర్సిటీ వాళ్ల సహకారం వల్ల హాస్పిటల్ నుంచి ఎగ్జామ్స్ రాసి పాసయ్యింది ధన్య. మార్చి వరకూ ఉంటే వర్క్ వీసాకు అర్హత వస్తుందని అప్పటి వరకూ అక్కడే ఉండి కొచ్చి చేరుకుంది. కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు వెళ్లి అడ్మిట్ అయ్యింది ధన్య. మెరుపు కలలు ధన్య ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నా మెరుపు కలలు కనడం మానలేదు. ఆమెకు మోడలింగ్ చేయాలని కోరిక. అలాగే పాటలకు డాన్స్ చేయడం కూడా సరదా. హాస్పిటల్ బెడ్ మీద ఉంటూ బోర్ పోయేందుకు కొన్ని సినిమా పాటలకు చేతులు కదిలించి డాన్స్ చేసి ఆ వీడియోలు రిలీజ్ చేసింది. అవి ఇన్స్టాంట్ హిట్ అయ్యాయి. మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి నటులు ఆమె స్థితిని తెలుసుకుని ఆ స్థితిలో కూడా అంత హుషారుగా ఉన్నందుకు మెచ్చుకున్నారు. తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మలుపుతిప్పిన ఘడియ కొచ్చి చేరుకుని వైద్యం తీసుకుంటున్న ధన్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మలబార్ గోల్డ్’ వారి ‘బ్రైడ్స్ ఆఫ్ ఇండియా’ యాడ్ కాంపెయిన్ ప్రకటన కనిపించింది. ‘మీకు పెళ్లికూతురిలా కనిపించాలని ఉందా’ అనే ప్రశ్నకు 7000 మంది యువతులు ‘అవును’ అని ఉత్సాహపడి సమాధానం ఇచ్చారు. ధన్య కూడా ఇచ్చింది. ఆ సంగతి మర్చిపోయింది. కాని కొన్నాళ్లకు మలబార్ గోల్డ్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. తమ ప్రకటనల్లో కేరళ వధువుగా కనిపించమని వారు కోరారు. ధన్య సంతోషానికి అవధులు లేవు. కేరళ క్రిస్టియన్ వధువుగా తెల్లగౌన్లో కనిపించడానికి అందుకు తగ్గ షూట్ చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. మలబార్‌గోల్డ్ ఈ షూట్ కోసం అసలు సిసలు వజ్రాల నెక్లెస్‌ను వాడటానికి పంపింది. దానిని ధరించిన ధన్య ఎంతో ముచ్చటపడింది. ‘ఈరోజు నాకెంతో బాగుంది’ అని అద్దంలో చూసుకుని మురిసిపోయింది. ఆమె స్వచ్ఛమైన నవ్వు వధువు పాత్రకు అందం తెచ్చింది. ఇదంతా చూస్తున్న ఆమె తల్లిదండ్రులు ‘ఈరోజు మా అమ్మాయి పేషెంట్ అన్న సంగతే మర్చిపోయింది’ అని ఎంతో సంబరంగా ఆమెను చూశారు. నిరాశలో కూడా ఒక ఆశ చేతికి దొరుకుతుంది. అంతవరకూ ఓపిక పట్టమని ధన్య నవ్వు అందరికీ చెబుతోంది. విశేష స్పందన ‘స్పెషల్ బ్రైడ్ ఆఫ్ ఇండియా’గా మలబార్ గోల్డ్ వారు విడుదల చేసిన ధన్య యాడ్ విశేష స్పందన పొందింది. ఆ యాడ్‌లో ధన్య ఎంతో అందంగా ఉందని అందరూ మెచ్చుకున్నారు. ఆమె నవ్వుకు ఎందరో ఫాన్స్ అయ్యారు. ఇవాళ ధన్య సెలబ్రిటీ అయ్యింది. తన అనారోగ్యాన్ని గెలిచి తీరగలననే ఆత్మవిశ్వాసం పొందింది. -
రెక్కలు లేని ఫ్యాన్.. అంతేనా అదిరిపోయే మరో స్పెషాలిటీ కూడా..
రెక్కల్లేని మొండి ఫ్యాను చక్కనిదెలా అవుతుందనేగా మీ డౌటు? ఇది చూడచక్కనిది అవునో, కాదో ఈ ఫొటో చూసి మీరే తేల్చుకోవాలి గానీ, దీని పనితీరు మాత్రం చక్కగానే ఉంటుంది. పనులు చేసుకునే డెస్క్ మీద, లేదా ఏదైనా టేబుల్ మీద సులువుగా ఇమిడిపోయే ఈ ఫ్యాన్ భేషుగ్గా మనం కోరుకున్న రీతిలో గాలి వీస్తుంది. వాతావరణం వేడిగా ఉంటే, చల్లనిగాలులు వీస్తుంది, వాతావరణం చల్లగా ఉంటే వెచ్చనిగాలులు వీస్తుంది. దాదాపుగా ఎయిర్‌కండిషనర్ మాదిరిగా పనిచేస్తుంది ఈ రెక్కల్లేని ఫ్యాను. దీనిని కెనడాలోని టొరంటో యూనివర్సిటీ రీసెర్చ్ అసిస్టెంట్ సోయంగ్ ఏన్ రూపొందించారు. ‘ఫ్లోడెస్క్ ఫ్యాన్’ పేరిట తయారు చేసిన ఈ ఫ్యాన్ గది వాతావరణానికి అనువుగా గాలులు వీచడమే కాదు, గాలిలోని దుమ్ము ధూళికణాలను పీల్చేసుకుని, స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. -
వీడియో సెల్ఫీతో రక్తపోటు తెలిసిపోతుంది!
రక్తపోటు తెలుసుకోవాలంటే ఇప్పుడు నానా అవస్థలు పడాల్సి ఉంటుంది. త్వరలోనే ఈ సమస్యలు తీరిపోతాయి. ఎందుకంటారా? కేవలం ఒక్క వీడియో సెల్ఫీతో రక్తపోటును లెక్క వేయగల సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది మరి. అధిక రక్తపోటు అనేది ప్రపంచ వ్యాప్తంగా ఓ తీవ్ర సమస్యగా మారిపోతున్న ఈ తరుణంలో ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తూండటం గమనార్హం. చేతి మణికట్టుకు బిగించుకోగల పరికరాలతో బీపీ చూసుకునే అవకాశమున్నప్పటికీ అవి ఎల్లప్పుడు మన చేతికి అంటిపెట్టుకుని ఉన్న అవకాశం తక్కువ. ఈ నేపథ్యంలో టొరంటో యూనివర్శిటీ శాస్త్రవేత్త కాంగ్ లీ ఈ వీడియో సెల్ఫీ టెక్నాలజీని అభివద్ధి చేశారు. చర్మం లోపలి చిత్రాలు తీయగల సాఫ్ట్‌వేర్‌తో తాము ముందుగా కొంతమంది ముఖాల వీడియోలు తీశామని.. రెండు నిమిషాల ఈ వీడియోల ద్వారా సేకరించిన రక్తపోటు వివరాలకు.. భౌతికంగా సేకరించిన వివరాలను సరిపోల్చి ఈ సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు. మెషీన్ లెర్నింగ్ పద్ధతులను వాడటం ద్వారా ఈ సాఫ్ట్వేర్ మన ముఖంలోని రక్తప్రసరణలో వచ్చే మార్పులను గుర్తించి.. దాని ఆధారంగా రక్తపోటును లెక్కకట్టగలదు. ఈ పద్ధతి ద్వారా వచ్చే వివరాలు 95 శాతం కచ్చితత్వంతో ఉన్నట్లు తమ అధ్యయనాల్లో తెలిసిందని కాంగ్ లీ తెలిపారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ ఫలితాలను నిర్ధారించుకోగలిగితే.. సమీప భవిష్యత్తులోనే అరనిమిషం వీడియో సెల్ఫీ మీ రక్తపోటు వివరాలను అందించవచ్చునని అంటున్నారు కాంగ్ లీ. -
ఫేసే చెప్పేస్తుంది బాసూ..!
ఫేస్ రీడింగ్ గురించి తెలిసిందే. ఎదుటి వ్యక్తి ముఖ కవళికల ఆధారంగా అతను ఏమనుకుంటున్నాడో చెప్పేయడమన్నమాట. అయితే అదే ముఖాన్ని చూసి ఓ వ్యక్తి సంపన్నుడా? నిరుపేదా? అనే విష యాన్ని కూడా చెప్పవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. కెనడాలోని టొరంటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కుటుంబ వార్షికాదాయం సగటున 75వేల అమెరికా డాలర్లు ఉండే వారిపై పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని వెల్లడించారు. కుటుంబ ఆదాయం 60వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకు ఉన్న కొంత మంది వ్యక్తుల ముఖచిత్రాలను వలంటీర్లకు చూపించారు. వారిలో ఎవరు పేదవారో, ఎవరు సంపన్నులో గుర్తించమన్నారు. 53 శాతం మంది పేదవారిని, డబ్బున్న వారిని గుర్తించ గలిగారు. ఒక వ్యక్తి ఆర్థిక స్థితిగ తులు అతని ముఖ కవళికలు, తోటివారితో మెలిగే విధానంపై ప్రభావం చూపుతాయని తేలింది. మన ముఖం మన అనుభవాలను, భావోద్వేగాలను ప్రదర్శిస్తుందని శాస్త్ర వేత్తల్లో ఒకరైన నికోలస్ రల్స్ చెబుతున్నారు. అంతేగాక మనం ఎవరిని చూసినా మొదటగా వారి ముఖం చూస్తా మని, మన మెదడులోని న్యూరాన్స్ మన ముఖ కవళికలను గుర్తించేలా చేస్తాయని ఆయన తెలిపారు. -
పేదలా? సంపన్నులా..? ఫేసే చెప్పేస్తుంది బాసూ!!
టొరంటో: ఫేస్ రీడింగ్ గురించి తెలిసిందే. ఎదుటి వ్యక్తి ముఖకవళికల ఆధారంగా అతను ఏమనుకుంటున్నాడో చెప్పేయడమన్నమాట. అయితే అదే ముఖాన్ని చూసి ఓ వ్యక్తి సంపన్నుడా? నిరుపేదా? అనే విషయాన్ని కూడా చెప్పవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. కెనడాలోని టొరంటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కుటుంబ వార్షికాదాయం సగటున 75వేల అమెరికా డాలర్లు ఉండే వారిపై పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని వెల్లడించారు. కుటుంబ ఆదాయం 60వేల డాలర్ల నుంచి లక్షడాలర్ల వరకు ఉన్న కొంత మంది వ్యక్తుల ముఖచిత్రాలను వలంటీర్లకు చూపించారు. వారిలో ఎవరు పేదవారో, ఎవరు సంపన్నులో గుర్తించమన్నారు. 53 శాతం మంది కరెక్టుగా పేదవారిని, డబ్బున్న వారిని గుర్తించగలిగారు. ఒక వ్యక్తి ఆర్థిక స్థితిగతులు అతని ముఖకవళికలు, తోటివారితో మెలిగే విధానంపై ప్రభావం చూపుతాయిని తేలింది. మన ముఖం మన అనుభవాలను, భావోద్వేగాలను ప్రదర్శిస్తుందని శాస్త్రవేత్తల్లో ఒకరైన నికోలస్ రల్స్ చెబుతున్నారు. అంతేగాక మనం ఎవరిని చూసినా మొదటగా వారి ముఖం చూస్తామని, మన మెదడులోని న్యూరాన్స్ మన ముఖ కవళికలను గుర్తించేలా చేస్తాయని ఆయన తెలిపారు.