
ఆమె పేరు లక్ష్మి, నెల్లూరువాసి. హీరో నాగార్జునకు వీరాభిమాని. అయితే ఆమె బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. మరికొద్ది నెలల్లో చివరి సర్జరీ చేయించుకోనుంది. ఈ విషయం కాస్తా నాగ్ చెవిన పడింది. ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ఆయన చలించిపోయారు. ఎలాగైనా తన అభిమానిని సంతోషపెట్టాలనుకున్నారు. ఆమెకు కొండంత ధైర్యం ఇవ్వాలనుకున్నారు. కానీ కరోనా కాలం కాబట్టి ఆమె దగ్గరకు వెళ్లలేకపోయారు. వెంటనే మరో ఐడియా రచించి, అనుకున్నదే తడవుగా అమలు చేశారు. నేడు(శుక్రవారం) ఆమెకు సర్‌ప్రైజ్ కాల్ చేశారు. తాను ఆరాధించే హీరో తనకు కాల్ చేతనకే స్వయంగా కాల్ చేశారన్న విషయాన్ని ఆమె నమ్మలేకపోయింది. నాగ్ గొంతు విని ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయింది. (చదవండి: బిగ్‌బాస్ 4 ప్రోమో.. గోపి ఎవరు?)
జూమ్ వీడియో కాల్‌లో అటు హీరో, ఇటు అభిమాని సరదాగా కాసేపటివరకు ముచ్చట్లాడుకున్నారు. 'ఈ జన్మకిది చాలు.. ఇక నేను చనిపోయినా ఫర్వాలేదు' అని లక్ష్మి సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నాగ్.. ఆమెకు తానున్నానంటూ ధైర్యాన్ని నూరిపోశారు. త్వరలోనే జబ్బు నయమవుతుంటూ భరోసా కల్పించారు. నాగ్‌తో మాట్లాడుతున్నంత సేపు లక్ష్మి ఈ లోకాన్నే మర్చిపోయింది. తనకసలు ఏ జబ్బు లేనట్లు, ఉన్నా అది చిటికెలో నయమైపోయినంత సంబరపడిపోయింది. ఇప్పుడు సర్జరీకి వెళ్లడానికి ఆమెకు కొంచెం కూడా భయం లేదు. ఎందుకంటే ఆమె వెనక నాగ్ ఇచ్చిన బలం, ధైర్యం జంటగా ఉందిప్పుడు. (చదవండి:ఇది బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్: తమన్)
Comments
Please login to add a commentAdd a comment