అహ్మదాబాద్: రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య లక్ష పైచిలుకు అభిమానులున్న స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. 6000 మందికి పైగా సాయుధ బలగాలు పహారా కాస్తున్నాయి. ఇంతటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన కూడా... ఆస్ట్రేలియాకు చెందిన పాలస్తీనా సానుభూతిపరుడు ఇన్ని అంచెలను దాటుకొని కోహ్లిని కలవడం, కౌగిలించుకోవడం కలకలం సృష్టించింది.
ఇది భద్రత డొల్లతనాన్ని భయటపెట్టింది. వెంటనే అప్రతమత్తమైన భద్రత దళాలు వేన్ జాన్సన్ అనే ఆ్రస్టేలియన్‌ను నిర్బంధించాయి. అతన్ని చాంద్ ఖేడా పోలీస్ స్టేషన్‌కు తరలించి తదుపరి విచారణ చేపట్టింది. ప్రస్తుతం పాలస్తీనాలో హమాస్, ఇజ్రాయెల్‌ల మధ్య భీకర దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే!
Comments
Please login to add a commentAdd a comment