ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇటీవల కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన సోషల్ మీడియాలో తరచూ పోస్టులు పంచుకుంటూ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకున్న ఆయన ఇకపై తనకు ఉద్యోగం దొరుకుందో లేదో అంటూ సరదాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సందేహం వ్యక్తం చేశారు. అయితే 65 ఏళ్లపైబడిన వారు అవుట్ డోర్ షూటింగ్‌లో పాల్గొనేందు వీలు లేదని మహరాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులపై బాంబే హైకోర్టు స్టే విధించింది. దీంలో మహరాష్ట్ర ఉత్తర్వులను ఉద్దేశిస్తూ బిగ్‌బీ సరదాగా చేసిన ట్వీట్‌కు ఓ అభిమాని చమత్కరించాడు. (చదవండి: సరిదిద్దుకున్నా.. నన్ను క్షమించండి: బిగ్‌బీ)
అమితాబ్‌కు ఉద్యోగ అవకాశం ఇస్తున్నట్లు ఓ ఆఫర్ లెటర్‌ను ఆయన పోస్టుకు ట్యాగ్ చేశాడు. దీనికి అమితాబ్.. ‘ఊహించని రీతిలో నాకు ఉద్యోగం వచ్చింది’ చూడండి అంటూ ఆ లేటర్‌ను పంచుకున్నారు. ఇందులో ‘‘ప్రియమైన మిస్టర్ అమితాబ్... కొన్ని కారణాల వల్ల ప్రత్యామ్నాయంగా మీకు ఉద్యోగం ఇచ్చేందుకు మీ దరఖాస్తు తాత్కాలికంగా సమీక్షలో ఉందని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము’’ అని ఉంది. ఇటీవల బిగ్ బీతో పాటు మహమ్మారి బారిన పడిన ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ ఆయన కోడలు, మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్యలు పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జైన విషయం తెలిసిందే. (చదవండి: కరోనాను జయించిన అభిషేక్)
Comments
Please login to add a commentAdd a comment