Sonu Sood Fan Gifts Him Painting Made Out Of Blood - Sakshi

Sonu Sood:  రక్తంతో సోనూసూద్‌ పెయింటింగ్‌.. షాక్‌ అయిన నటుడు

Sep 10 2022 1:05 PM | Updated on Sep 10 2022 3:15 PM

Sonu Sood Fan Gifts Him Painting Made Out Of Blood - Sakshi

సినిమాల్లో విలన్‌ పాత్రలు వేస్తూ నిజజీవితంలో మాత్రం ఎందరికో సాయం చేస్తూ రియల్‌ హీరోగా నిలిచారు నటుడు సోనూసూద్‌. కరోనా కష్టకాలంలో ఎంతోమందికి సాయం చేసి ఆపద్బాంధవుడిలా ఆదుకున్నారు. నటనతో పాటు సేవా కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సోనూసూద్‌కి దేశ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు.

తాజాగా మధు గుర్జార్ అనే ఫ్యాన్‌ సోనూసూద్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. తన రక్తంతో సోసూసూద్‌ పెయింటింగ్‌ వేసి ఆయనకే బహుమతిగా ఇచ్చాడు. అభిమాని చేసిన పనికి షాక్‌ అయిన సోనూసూద్‌ రక్తంతో తన బొమ్మను గీయడం కంటే రక్తదానం చేస్తే ఇంకా సంతోషించేవాడినని చెప్పుకొచ్చారు.

దీనికి సంబంధించిన వీడియోను సోనూసూద్‌ ట్విట్టర్‌లో షేర్‌చేస్తూ రక్తం వృథా చేయకుండా దానం చేయాలని కోరాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. సోసూసూద్‌ చివరగా చాంద్‌ బార్దాయ్‌ అనే చిత్రంలో నటించాడు. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement