
John Abraham Snatches Fans Phone Video Goes Viral: తమ అభిమాన హీరో కనిపిస్తే చాలు.. అభిమానుల ఆనందానికి అవధులుండవు. వారితో ఒక్క ఫోటో అయినా దిగాలని తెగ ఆరాటపడుతుంటారు. మరికొందరైతే కనీసం వాళ్ల అనుమతి కూడా తీసుకోకుండా ఫోటోలు క్లిక్‌మనిపిస్తారు. తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం తన స్నేహితుడిగా కలిసి రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు అభిమానులు బైక్‌పై కూర్చొని సెల్ఫీ వీడియో రికార్డ్ చేస్తున్నారు. అంతలోనే జాన్ అబ్రహం వాళ్ల దగ్గరకు వచ్చి వాళ్ల చేతుల్లోంచి ఫోన్ లాక్కున్నాడు.
అనంతరం కెమెరా వైపు చూస్తూ.. హాయ్ గాయ్స్ ఇప్పుడు ఒకేనా..? అంటూ నవ్వుతూ మాట్లాడాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. స్టార్ హీరో అయ్యిండి కూడా అభిమానులను ఫన్నీగా ఆటపట్టించడం భలేగుందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యాక్షన్ హీరో సత్యమేవజయతే-2 చిత్రంలో నటిస్తున్నాడు. నవంబర్ 25న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.