snatch cell phone
-
సీక్రెట్‌గా వీడియో రికార్డ్.. ఫోన్ లాక్కున్న స్టార్ హీరో
John Abraham Snatches Fans Phone Video Goes Viral: తమ అభిమాన హీరో కనిపిస్తే చాలు.. అభిమానుల ఆనందానికి అవధులుండవు. వారితో ఒక్క ఫోటో అయినా దిగాలని తెగ ఆరాటపడుతుంటారు. మరికొందరైతే కనీసం వాళ్ల అనుమతి కూడా తీసుకోకుండా ఫోటోలు క్లిక్‌మనిపిస్తారు. తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం తన స్నేహితుడిగా కలిసి రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు అభిమానులు బైక్‌పై కూర్చొని సెల్ఫీ వీడియో రికార్డ్ చేస్తున్నారు. అంతలోనే జాన్ అబ్రహం వాళ్ల దగ్గరకు వచ్చి వాళ్ల చేతుల్లోంచి ఫోన్ లాక్కున్నాడు. అనంతరం కెమెరా వైపు చూస్తూ.. హాయ్ గాయ్స్ ఇప్పుడు ఒకేనా..? అంటూ నవ్వుతూ మాట్లాడాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. స్టార్ హీరో అయ్యిండి కూడా అభిమానులను ఫన్నీగా ఆటపట్టించడం భలేగుందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యాక్షన్ హీరో సత్యమేవజయతే-2 చిత్రంలో నటిస్తున్నాడు. నవంబర్ 25న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. -
కాల్ చేస్తామని ఫోన్ కొట్టేసి బైక్‌తో ఈడ్చుకెళ్లారు, వైరల్ వీడియో
తిరువనంతపురం: కేరళలోని కోజిగోడ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఫోన్‌కాల్ చేసుకుంటామని చెప్పి మొబైల్‌ఫోన్ కొట్టేయడమే కాకుండా అడ్డు వచ్చిన సదరు వ్యక్తిని బైక్‌తో కొద్దిదూరం పాటు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. వివరాలు.. బిహార్‌కు చెందిన అలీ అక్బర్ కోజిగోడ్‌కు పనినిమిత్తం వచ్చారు. తన పని ముగించుకొని రోడ్డుపై వెళుతుండగా.. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. తమ ఫోన్ పాడైందని.. అర్జెంటుగా ఒక కాల్ చేసుకుంటామని చెప్పి అక్బర్‌ను అడిగారు. వారి మాటలు నమ్మిన అక్బర్ తన ఫోన్‌ను వారి చేతిలో పెట్టగానే యువకులిద్దరు వెంటనే బైక్‌ను స్టార్ట్ చేసి అక్కడినుంచి పారిపోయేందుకు యత్నించారు. అయితే బైకును అక్బర్ పట్టుకొని ఉండడంతో అతన్ని అలాగే రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఈ క్రమంలో అలీతో పాటు బైకుపై వెనకాల కూర్చున్న దొంగ కూడా కిందపడిపోయాడు. ఆ తర్వాత అక్బర్ బైకును వెంబడించినా ప్రయోజనం లేకపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అక్బర్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. కాగా అక్బర్ వద్ద ఫోన్ దొంగలించిన ఇద్దరు యువకులను సాను కృష్ణన్, షమ్నాస్ అబ్దురాహిమాన్‌లుగా గుర్తించారు. అయితే దుండగులకు చెందిన ఒక ఫోన్ అక్కడపడిపోగా స్థానికులు దానిని పోలీసులకు అందించారు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
అత్త సెల్‌ఫోన్ లాక్కొందని..
బలియా: అత్త సెల్‌ఫోన్ లాక్కునందుకు ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లా రెవతి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఆత్మహత్యకు పాల్పడిన యువతి భర్త గుజరాత్లో పనిచేస్తున్నాడు. ఆమె అత్తవారి ఇంట్లో ఉండేది. గత గురువారం ఇల్లు విడిచి వెళ్లిన ఆ మహిళ మరుసటి రోజు తిరిగి వచ్చింది. ఆమెకు అదే గ్రామంలోని ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఉందని అత్త అనుమానించింది. ఆ మహిళ ఇంటికి రాగానే అత్త సెల్‌ఫోన్ లాక్కోని మందలించింది. మనస్తాపం చెందిన ఆ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.