
పూజలు చేస్తున్న రఘుపతిరాజు కుటుంబ సభ్యులు
బంగారుపాళెం(చిత్తూరు జిల్లా): దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై ప్రజాభిమానం తరగలేదు. బంగారుపాళెం మండలంలోని తగ్గువారిపల్లెకు చెందిన జిల్లా వైఎస్సార్‌సీపీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు రఘుపతిరాజు వైఎస్సార్ వీరాభిమాని.
చనిపోయిన తన తల్లిదండ్రుల చిత్ర పటాలతో పాటు తాను అమితంగా అభిమానించే దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్ర పటం ముందు సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త బట్టలు పెట్టి పూజలు నిర్వహించి తన అభిమానాన్ని చాటుకున్నారు.
బంధువులు, స్నేహితులను పిలిచి మధ్యాహ్నం అన్నదానం చేశారు. రాజశేఖర్‌రెడ్డి మృతి చెందినప్పటి నుంచి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహానేత అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎందరో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment