The Alchemist: పుస్తక ప్రియులకు పరిచయం అక్కర్లేని నవల ది ఆల్కెమిస్ట్. తన అదృష్టాన్ని పరీక్షించుకునే క్రమంలో ఓ గొర్రెల కాపరి పిల్లాడి జీవన ప్రయాణం, అతనికి ఎదురైన ఆటుపోట్లు అనుభవాల సారమే ఈ పుస్తకం. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఈ పుస్తకం నుంచి స్ఫూర్తిని పొందారు. ఈ నవల రచయిత పాలో కోయిలోకి లక్షల మంది అభిమానులయ్యారు. అలాంటి వారిలో ఒకరు కేరళకు చెందిన ప్రదీప్.
కేరళలోని చెరాయ్‌కి చెందిన ప్రదీప్ ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పుస్తకాలు చదవడమంటే ప్రాణం. ప్రసిద్ధ రచయితల పుస్తకాలన్నీ చదివేశాడు. అయితే అందులో అమితంగా ఆకట్టుకుంది ఆల్కెమిస్ట్. అందుకే తన అభిమానానికి గుర్తుగా తన ఆటో వెనుక ఆల్కెమిస్ట్ నవల పేరుని మళయాళంలో, దాని రచయిత పాలో కోయిలో పేరును ఇంగ్లీష్‌లో రాసుకున్నాడు. ఈ విషయం కాస్త సోషల్ మీడియా ద్వారా ఎక్కడో బ్రెజిల్లో ఉన్న పాలోకోయిలోకి చేరింది.
ఇండియాలో కేరళ రాష్ట్రంలో ఓ ఆటో వెనుక తన పేరు రాసుకున్న ఫోటోను పాలో కోయిలో ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ ఫోటో పంపినందుకు థ్యాంక్స్ కూడా చెప్పారు. ట్విట్టర్ అకౌంట్‌లో ప్రదీప్ ఆటో కనిపించడతో ఒక్కసారిగా అతనికి ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. స్థానిక మీడియాలో అతని పేరు మార్మోగిపోతోంది. ఏదైనా ఒక రోజు బ్రెజిల్ వెళ్లి తన అభిమాన రచయితను తప్పకుండా కలుస్తానంటున్నాడు ప్రదీప్.
Kerala, India (thank you very much for the photo) pic.twitter.com/13IdqKwsMo
— Paulo Coelho (@paulocoelho) September 4, 2021
Comments
Please login to add a commentAdd a comment