బ్రిస్బేన్: వెనిజులా క్రీడాకారిణి గార్బైన్ ముగురుజా అనూహ్య పరిణామాల నడుమ బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. తీవ్ర వేడిమిని తట్టుకోలేక మ్యాచ్ మధ్యలోనే ఆమె కోర్టులో కుప్పకూలిపోయారు.
మంగళవారం సెర్బియా క్రీడాకారిణి అలెక్జాండ్రా క్రునిక్ తో రెండో రౌండ్ లో గార్బైన్ తలపడింది. మ్యాచ్ మధ్యలో వేడిమి తట్టుకోలేక ఆమె అస్వస్థతకు గురయ్యారు. అయితే ఆమెకు చికిత్స అందజేయగా.. మళ్లీ మ్యాచ్ కొనసాగింది. తర్వాత 2-1 తో సెట్స్ గెలుచుకున్న గార్బైన్.. మూడో సెట్ హోరాహోరీగా జరుగుతున్న సమయంలో మళ్లీ కుప్పకూలిపోయింది. ఈసారి కోలుకునే అవకాశాలు కనిపించకపోవటంతో ఆమె ఓటమిని అంగీకరించింది. దీంతో క్రునిక్‌ను విజేతగా ప్రకటించారు. క్వార్టర్ ఫైనల్ లో క్రునిక్ సొరానా కిర్‌స్టియా లేక అనస్తాసిజా సెవాస్తోవాలో ఎవరో ఒకరితో తలపడనుంది.
ఇక ప్రపంచ ర్యాంక్ 2 క్రీడాకారిణి అయిన ముగురుజా టోర్నీ నుంచి నిష్క్రమించటంతో.. నంబర్-1 ర్యాంకు సాధించాలన్న ఆమె కల క్లిష్టతరంగా మారింది. త్వరలో ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీ ఉన్న నేపథ్యంలో.. రిస్క్ చేసే ఉద్దేశం లేకనే వైదొలగినట్లు ముగురుజా ప్రకటించారు. కాగా, జనవరి 15 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment