Brisbane Open tournament
-
బ్రిస్బేన్ ఓపెన్ టోర్నీతో సానియా పునరాగమనం
ముంబై: భారత మహిళల టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వచ్చే ఏడాది జనవరిలో బ్రిస్బేన్ ఓపెన్ టోర్నీతో అంతర్జాతీయ సర్క్యూట్లో పునరాగమనం చేయనుంది. గత ఏడాది అక్టోబర్‌లో బాబు ఇజ్హాన్కు జన్మనిచ్చిన సానియా రెండేళ్లుగా ఆటకు దూరంగా ఉంది. ఇటీవల మళ్లీ రాకెట్ పట్టిన ఈ హైదరాబాద్ స్టార్ వారంలో ఆరు రోజులపాటు ప్రాక్టీస్ చేస్తోంది. మహిళల, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో కలిపి ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన సానియా మహిళల డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌గా కూడా నిలిచింది. జనవరిలో బ్రిస్బేన్ ఓపెన్, హోబర్ట్ ఓపెన్ టోర్నీల్లో ఉక్రెయిన్ క్రీడాకారిణి నదియా కిషెనోక్‌తో కలిసి ఆడనున్న 33 ఏళ్ల సానియా ఆ తర్వాత సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో కూడా బరిలోకి దిగనుంది. ప్రస్తుతం రోజూ ఉదయం నాలుగైదు గంటలు ప్రాక్టీస్ చేస్తున్న సానియా సాయంత్రం వేళలో జిమ్‌లో కసరత్తులు చేస్తోంది. ‘పునరాగమనంలో కొత్తగా ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకోలేదు. స్వేచ్ఛగా, ఒత్తిడి లేకుండా ఆడతాను. నా టెన్నిస్ కెరీర్లో కోరుకున్న విజయాలన్నీ సాధించాను. భవిష్యత్‌లో సాధించే విజయాలన్నీ బోనస్‌లాంటివే’ అని సానియా వ్యాఖ్యానించింది -
కోర్టులోనే కుప్పకూలి.. నిష్క్రమించింది
బ్రిస్బేన్: వెనిజులా క్రీడాకారిణి గార్బైన్ ముగురుజా అనూహ్య పరిణామాల నడుమ బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. తీవ్ర వేడిమిని తట్టుకోలేక మ్యాచ్ మధ్యలోనే ఆమె కోర్టులో కుప్పకూలిపోయారు. మంగళవారం సెర్బియా క్రీడాకారిణి అలెక్జాండ్రా క్రునిక్ తో రెండో రౌండ్ లో గార్బైన్ తలపడింది. మ్యాచ్ మధ్యలో వేడిమి తట్టుకోలేక ఆమె అస్వస్థతకు గురయ్యారు. అయితే ఆమెకు చికిత్స అందజేయగా.. మళ్లీ మ్యాచ్ కొనసాగింది. తర్వాత 2-1 తో సెట్స్ గెలుచుకున్న గార్బైన్.. మూడో సెట్ హోరాహోరీగా జరుగుతున్న సమయంలో మళ్లీ కుప్పకూలిపోయింది. ఈసారి కోలుకునే అవకాశాలు కనిపించకపోవటంతో ఆమె ఓటమిని అంగీకరించింది. దీంతో క్రునిక్ను విజేతగా ప్రకటించారు. క్వార్టర్ ఫైనల్ లో క్రునిక్ సొరానా కిర్‌స్టియా లేక అనస్తాసిజా సెవాస్తోవాలో ఎవరో ఒకరితో తలపడనుంది. ఇక ప్రపంచ ర్యాంక్ 2 క్రీడాకారిణి అయిన ముగురుజా టోర్నీ నుంచి నిష్క్రమించటంతో.. నంబర్-1 ర్యాంకు సాధించాలన్న ఆమె కల క్లిష్టతరంగా మారింది. త్వరలో ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీ ఉన్న నేపథ్యంలో.. రిస్క్ చేసే ఉద్దేశం లేకనే వైదొలగినట్లు ముగురుజా ప్రకటించారు. కాగా, జనవరి 15 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభం కానుంది. -
బ్రిస్బేన్ టోర్నీతో మొదలు...
గతేడాది హింగిస్ (స్విట్జర్లాండ్)తో జతగా తొమ్మిది డబుల్స్ టైటిల్స్ నెగ్గిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా... కొత్త సీజన్‌ను బ్రిస్బేన్ ఓపెన్ టోర్నీతో మొదలుపెట్టనుంది. సోమవారం ఆరంభమయ్యే ఈ టోర్నీ తొలి రౌండ్లో ప్రిసిల్లా (ఆస్ట్రేలియా)-తొమ్లాజనోవిచ్ (క్రొయేషియా) జోడీతో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట ఆడుతుంది. -
క్వార్టర్స్‌లో సానియా జంట
బ్రిస్బేన్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కొత్త భాగస్వామితో కొత్త సీజన్‌ను విజయంతో ప్రారంభించింది. బ్రిస్బేన్ ఓపెన్ టోర్నీలో ఈ హైదరాబాదీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సానియా-సు వి సెయి (చైనీస్ తైపీ) జంట 7-5, 6-3తో జర్మీలా గజ్దోసోవా (ఆస్ట్రేలియా)-తొమ్లజనోవిచ్ (సెర్బియా) ద్వయంపై గెలిచింది. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో అనస్తాసియా రొడియోనోవా-అరీనా రొడియోనోవా (ఆస్ట్రేలియా) జోడీతో సానియా జంట ఆడుతుంది. బోపన్న జంటకు షాక్ మరోవైపు ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగం తొలి రౌండ్లో రెండో సీడ్ రోహన్ బోపన్న (భారత్)-డానియల్ నెస్టర్ (కెనడా) జంట 4-6, 6-3, 6-10తో డొల్గోపొలోవ్ (ఉక్రెయిన్)-కీ నిషికోరి (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయింది.