క్వార్టర్స్‌లో సానియా జంట | Sania Mirza-Wei Hsieh make winning start at Brisbane International | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సానియా జంట

Published Wed, Jan 7 2015 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM

క్వార్టర్స్‌లో సానియా జంట

క్వార్టర్స్‌లో సానియా జంట

బ్రిస్బేన్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కొత్త భాగస్వామితో కొత్త సీజన్‌ను విజయంతో ప్రారంభించింది. బ్రిస్బేన్ ఓపెన్ టోర్నీలో ఈ హైదరాబాదీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో టాప్ సీడ్ సానియా-సు వి సెయి (చైనీస్ తైపీ) జంట 7-5, 6-3తో జర్మీలా గజ్దోసోవా (ఆస్ట్రేలియా)-తొమ్లజనోవిచ్ (సెర్బియా) ద్వయంపై గెలిచింది. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో అనస్తాసియా రొడియోనోవా-అరీనా రొడియోనోవా (ఆస్ట్రేలియా) జోడీతో సానియా జంట ఆడుతుంది.
 
బోపన్న జంటకు షాక్
మరోవైపు ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగం తొలి రౌండ్‌లో రెండో సీడ్ రోహన్ బోపన్న (భారత్)-డానియల్ నెస్టర్ (కెనడా) జంట 4-6, 6-3, 6-10తో డొల్గోపొలోవ్ (ఉక్రెయిన్)-కీ నిషికోరి (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement