the womens doubles
-
సెమీస్‌లో సానియా జంట
బ్రిస్బేన్: కీలకదశలో ఒత్తిడిని జయించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-సు వి సెయి (చైనీస్ తైపీ) ద్వయం బ్రిస్బేన్ ఓపెన్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా-సు వి సెయి జంట 6-3, 2-6, 11-9తో అనస్తాసియా రొడియోనోవా-అరీనా రొడియోనోవా (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. సానియా మీర్జా, సు వి సెయి, సెమీఫైనల్స్, మహిళల డబుల్స్, Sania Mirza, Hsu v St, in the semifinals, the women's doubles -
క్వార్టర్స్‌లో సానియా జంట
బ్రిస్బేన్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కొత్త భాగస్వామితో కొత్త సీజన్‌ను విజయంతో ప్రారంభించింది. బ్రిస్బేన్ ఓపెన్ టోర్నీలో ఈ హైదరాబాదీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సానియా-సు వి సెయి (చైనీస్ తైపీ) జంట 7-5, 6-3తో జర్మీలా గజ్దోసోవా (ఆస్ట్రేలియా)-తొమ్లజనోవిచ్ (సెర్బియా) ద్వయంపై గెలిచింది. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో అనస్తాసియా రొడియోనోవా-అరీనా రొడియోనోవా (ఆస్ట్రేలియా) జోడీతో సానియా జంట ఆడుతుంది. బోపన్న జంటకు షాక్ మరోవైపు ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగం తొలి రౌండ్లో రెండో సీడ్ రోహన్ బోపన్న (భారత్)-డానియల్ నెస్టర్ (కెనడా) జంట 4-6, 6-3, 6-10తో డొల్గోపొలోవ్ (ఉక్రెయిన్)-కీ నిషికోరి (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
రన్నరప్ సానియా జంట
సాక్షి, హైదరాబాద్: బీజింగ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. చైనాలోని బీజింగ్‌లో శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సానియా-కారా బ్లాక్ ద్వయం 4-6, 4-6తో హలవకోవా (చెక్ రిపబ్లిక్)-షుయె పెంగ్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. గంటా 28 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్లో సానియా జంట తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. మరోవైపు ప్రత్యర్థి జంట సర్వీస్‌ను 10 సార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా కేవలం ఒకసారి మాత్రమే సద్వినియోగం చేసుకుంది. రన్నరప్‌గా నిలిచిన సానియా జోడీకి 1,55,910 డాలర్ల (రూ. 96 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.