Players Must Vaccinated To Play Australian Grand Slam.. వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆడాలంటే ప్లేయర్లందరూ తప్పనిసరిగా కోవిడ్–19 వ్యాక్సిన్‌ను వేయించుకోవాలని టోర్నీ చీఫ్ క్రెయిగ్ టిలీ శనివారం స్పష్టం చేశాడు. వ్యాక్సిన్ వేయించుకున్నట్లు ధ్రువీకరణ పత్రం చూపించని వారిని టోర్నీలో ఆడనిచ్చేది లేదంటూ ఆయన తెలిపారు. క్రెయిగ్ ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్‌ను ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు.
జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడాలనుకుంటే వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నాడు. దాంతో తొమ్మిదిసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ జొకోవిచ్ ఈసారి టోర్నీలో ఆడేది అనుమానంగా కనిపిస్తుంది. ఎందుకం టే గతంలో అతడు వ్యాక్సిన్ వేసుకోవడంపై విముఖత వ్యక్తం చేశాడు. అంతేకాకుండా అది వ్యక్తిగత విషయమని వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment