లండన్: ప్రపంచ టెన్నిస్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌లాంటి స్టార్ ప్లేయర్లు కోవిడ్ టీకా తీసుకోకపోయినా ఈసారి వింబుల్డన్ టోర్నీలో ఆడనిస్తామని ‘ఆల్ ఇంగ్లండ్ క్లబ్’ స్పష్టం చేసింది. అలాగే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ కోర్టు నుంచి ‘కోవిడ్ ప్రొటోకాల్’ కూడా అవుట్ అయింది. దీంతో క్వారంటైన్, నిర్బంధ టెస్టులు, నిబంధనలు ఈసారి ఉండబోవు. దీంతో ప్రేక్షకులు రెండేళ్ల తర్వాత తమకెంతో ఇష్టమైన వింబుల్డన్ టోర్నీలో మ్యాచ్‌లను పూర్తిస్థాయిలో ప్రత్యక్షంగా ఆస్వాదించవచ్చు.
కరోనాతో 2020 వింబుల్డన్ టోర్నీ రద్దవగా, గతేడాది టోర్నీని ప్రేక్షకుల్లేకుండా నిర్వహించారు. కోవిడ్ తీవ్రత తగ్గడంతో ఇంగ్లండ్‌లో క్వారంటైన్ తదితర ప్రొటోకాల్ నిబంధనల్ని ఎత్తేశారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో టైటిల్ నిలబెట్టుకునేందుకు వెళ్లి నిబంధనల చట్రంలో... ఆస్ట్రేలియన్ అధికారుల నిర్బంధనంలో విసిగిపోయిన జొకోవిచ్‌కు తన సత్తా చాటేందుకు వింబుల్డన్ సరైన వేదిక కానుంది. డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్‌కు ఇప్పుడు ఏ బంధనం అడ్డుకోదు. ఇదే కాదు ఫ్రెంచ్ ఓపెన్ కూడా కోవిడ్ కోరల్లోంచి బయటపడింది. దీంతో 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల జొకోవిచ్ ఈ ఏడాది మరిన్ని విజయాలు అందుకునే అవకాశాలు మెరుగయ్యాయి. ఫ్రెంచ్ ఓపెన్ పారిస్‌లో మే 22 నుంచి జూన్ 5 వరకు... వింబుల్డన్ టోర్నీ లండన్‌లో జూన్ 27 నుంచి జూలై 10 వరకు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment