![Does Novak Djokovic Play Australian Open Grand Slam Will Decide - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/10/Djokovic.jpg.webp?itok=0btmWnCP)
మెల్‌బోర్న్: సెర్బియా టెన్నిస్ దిగ్గజం, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడేది లేనిది నేడు తేలిపోనుంది. వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక వైద్య మినహాయింపుతో జొకోవిచ్ ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాడు. అయితే మినహాయింపు పొందడానికి జొకోవిచ్ సమర్పించిన కారణాలు సహేతుకంగా లేవని అతడిని ఆస్ట్రేలియా బోర్డర్ అధికారులు మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టులోనే నిలిపివేసి, వీసాను రద్దు చేశారు. దీనిపై జొకోవిచ్ కోర్టులో కేసు వేయగా... నేడు ఫెడరల్ సర్క్యూట్, ఆస్ట్రేలియన్ ఫ్యామిలీ కోర్టు దీనిని విచారించనుంది.
Comments
Please login to add a commentAdd a comment