Tennis Player Novak Djokovic Stuck In Airport, Serbian President Demands Australian Entry - Sakshi
Sakshi News home page

జొకోవిచ్‌కు ఊహించని షాక్‌.. విమానాశ్రయంలోనే నిలిపివేత

Jan 6 2022 4:40 AM | Updated on Jan 6 2022 7:04 PM

Djokovic Stuck In Airport Serbian President Demands Australian Entry - Sakshi

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో టైటిల్‌ నిలబెట్టుకునేందుకు వచ్చిన డిఫెండింగ్‌ చాంపియన్ జొకోవిచ్‌కు ఊహించని షాక్‌ ఎదురైంది.

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో టైటిల్‌ నిలబెట్టుకునేందుకు ప్రత్యేక వైద్య మినహాయింపుతో ఇక్కడికి వచ్చిన డిఫెండింగ్‌ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌కు ఊహించని షాక్‌ ఎదురైంది. ఒక్క డోసు తీసుకోకపోయినా... ఆరంభ గ్రాండ్‌స్లామ్‌ ఆడేందుకు మినహాయింపు ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా టోర్నీ నిర్వాహకులు అనుమతించారు.

అయితే మినహాయింపు కోసం అతను జతచేసిన ధ్రువపత్రాల్లో సహేతుక కారణాలు ఉండాల్సిందే. ఆస్ట్రేలియా వీసా కోసం ఇవన్నీ స్క్రూటినీ చేశాకే వీసా మంజూరు చేస్తారు. ఇప్పుడు వీసా పొరపాటు కారణంగానే అతన్ని మెల్‌బోర్న్‌ విమానాశ్రయంలో నిలిపివేశారు. ఈ అంశంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మోరిసన్‌ కూడా స్పందించారు. టీకా తీసుకోకపోవడానికి గల సరైన కారణాలుంటేనే వీసాగానీ, ఆడనిచ్చేదిగానీ జరుగుతుందని లేదంటే ఎంతవారైనా తిరుగు పయనం కావాల్సిందేనని స్పష్టం చేశారు. మొత్తం మీద జొకో టైటిల్‌ వేటలో ఉండేది లేనిది నేడు తేలే అవకాశముంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement