మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ జొకోవిచ్‌కు మూడో రౌండ్‌లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అమెరికా యువతార, 27వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్‌తో 3 గంటల 25 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) 7–6 (7/1), 6–4, 3–6, 4–6, 6–2తో గెలిచి ఊపిరి పీల్చుకున్నాడు. ఈ మ్యాచ్ మూడో సెట్ తొలి గేమ్ సందర్భంగా జొకోవిచ్ జారి పడ్డాడు. మెడికల్ టైమ్‌అవుట్ తీసుకొని కోర్టులోనే చికిత్స చేయించుకొని జొకోవిచ్ ఆట కొనసాగించాడు.
నొప్పితోనే ఆడిన జొకోవిచ్ మూడో సెట్, నాలుగో సెట్‌ను చేజార్చుకున్నాడు. అయితే తన అనుభవాన్నంతా రంగరించి పోరాడిన ఈ సెర్బియా స్టార్ ఐదో సెట్‌లోని ఆరో గేమ్‌లో, ఎనిమిదో గేమ్‌లో ఫ్రిట్జ్ సర్వీస్‌లను బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ థీమ్ (ఆస్ట్రియా) 4–6, 4–6, 6–3, 6–4, 6–4తో కిరియోస్ (ఆస్ట్రేలియా)పై, ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6–3, 6–3, 6–1తో మనారినో (ఫ్రాన్స్)పై నెగ్గగా... ఎనిమిదో సీడ్ ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 3–6, 3–6, 3–6తో క్వాలిఫయర్ కరాత్‌సెవ్ (రష్యా) చేతిలో... 11వ సీడ్ షపోవలోవ్ (కెనడా) 5–7, 5–7, 3–6తో ఆలియాసిమ్ (కెనడా) చేతిలో ఓడిపోయారు.
సెరెనా ముందుకు...
మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్, పదో సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 7–6 (7/5), 6–2తో పొటపోవా (రష్యా)పై, రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) 6–1, 6–3తో కుదర్‌మెతోవా (రష్యా)పై, మూడో సీడ్ నయోమి ఒసాకా (జపాన్) 6–3, 6–2తో ఆన్స్ జబుయెర్ (ట్యూనిసియా)పై, ఏడో సీడ్ సబలెంకా (బెలారస్) 6–3, 6–1తో ఆన్ లీ (అమెరికా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.
గట్టెక్కిన జొకోవిచ్
Published Sat, Feb 13 2021 5:13 AM | Last Updated on Sat, Feb 13 2021 5:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment