టెన్నిస్ సంచలనం సెరెనా విలియమ్స్ (35) తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. 23 గ్లాండ్ స్లామ్‌లను గెలుచుకుని ప్రపంచంలోనే గ్రేటెస్ట్ అథ్లెట్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న సెరెనా తన ప్రెగ్నెసీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా నెలల గర్భంతో వర్క్ అవుట్ చేస్తున్న వీడయో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎన్నో కష‍్టనష్టాలు, వివక్షను ఎదుర్కొని అటు ఆదాయంలోనూ, ఇటు టెన్నిస్ ర్యాంకింగ్‌లోనూ పటిష్టంగా నిలబడిన సెరీనా జిమ్‌లో కసరత్తు చేస్తున్న ఈ వీడియో చూస్తే స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్ అని అనిపించకమానదు.
కాగా రెడిట్ కో ఫౌండర్ అలెక్సిస్ ఒహానియన్‌తో సెరెనా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. గత నెలలో వానిటీ మ్యాగజైన్ ఆగస్టు సంచికకు కోసం సెరెనా విలియమ్స్ నగ్నంగా ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.