
ఫ్లోరిడా: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి అమెరికా టెన్నిస్ స్టార్, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ వైదొలిగింది. తాను పూర్తి స్థాయిలో ప్రాక్టీస్ చేయకపోవడంతో ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్‌లో బిడ్డకు జన్మనిచ్చిన సెరెనా.. అబుదాబి ఎగ్జిబిషన్ టోర్నీ తొలి రౌండ్‌లోనే ఓటమి పాలు కావడం కూడా ఆమె తాజా నిర్ణయానికి ఒక కారణం.
'నేను వ్యక్తిగత కారణాలతోనే ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరమవుతున్నా. నాకు ఆడాలని ఉంది. కాకపోతే కేవలం ఆడామన్న పేరుకే గ్రాండ్ స్లామ్‌కు సిద్దం కావాలనుకోవడం లేదు. ఈ నిర్ణయం నా కోచ్ సలహా మేరకే తీసుకున్నా. నేను పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడానికి ఇంకా సమయం కావాలి. దాంతో ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా' అని సెరెనా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment