మెల్‌బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో శుక్రవారం సంచలనాల మోత మోగింది. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్), మాజీ విజేతలు సెరెనా విలియమ్స్ (అమెరికా), కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్), పదో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. మార్గరెట్ కోర్ట్ (ఆ్రస్టేలియా) పేరిట ఉన్న 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ రికార్డును సమం చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఎనిమిదో సీడ్ సెరెనా విలియమ్స్ ఆశలను చైనాకు చెందిన 28 ఏళ్ల కియాంగ్ వాంగ్ వమ్ము చేసింది.
2 గంటల 41 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో 19వ సీడ్ కియాంగ్ వాంగ్ 6–4, 6–7 (2/7), 7–5తో ఆరుసార్లు ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్ సెరెనాను బోల్తా కొట్టించింది. గతేడాది యూఎస్ ఓపెన్‌లో సెరెనాతో క్వార్టర్ ఫైనల్లో కేవలం ఒక్క గేమ్ మాత్రమే నెగ్గి ఘోరంగా ఓడిన కియాంగ్ వాంగ్ తాజా గెలుపుతో అమెరికా స్టార్‌పై ప్రతీకారం తీర్చుకుంది. అమెరికాకు చెందిన 15 ఏళ్ల టీనేజ్ సంచలనం కోరి గౌఫ్ మరో అద్భుతం చేసింది.
మూడో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ నయోమి ఒసాకాతో 67 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో గౌఫ్ 6–3, 6–4తో నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో ఆన్స్ జెబూర్ (ట్యూని íÙయా) 7–5, 3–6, 7–5తో 2018 చాంపియన్, మాజీ ప్రపంచ నంబర్‌వన్ వొజ్నియాకిని ఓడించింది. మరో మ్యాచ్‌లో మరియా సకారి (గ్రీస్) 6–4, 6–4తో పదో సీడ్ కీస్‌పై నెగ్గింది. టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆ్రస్టేలియా) 6–3, 6–2తో రిబకినా (కజకిస్తాన్)పై, ఏడో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–1, 6–2తో అలెగ్జాండ్రోవా (రష్యా)పై గెలిచారు.
జొకోవిచ్ జోరు...
పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) అతి కష్టమ్మీద... డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) సులువుగా మూడో రౌండ్‌ను దాటారు. 38 ఏళ్ల ఫెడరర్ 4 గంటల 3 నిమిషాల పోరులో 4–6, 7–6 (7/2), 6–4, 4–6, 7–6 (10/8)తో జాన్ మిల్‌మన్ (ఆ్రస్టేలియా)పై గెలుపొందగా... జొకోవిచ్ 6–3, 6–2, 6–2తో నిషియోకా (జపాన్)ను ఓడించాడు. మిల్‌మన్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి సెట్ సూపర్ టైబ్రేక్‌లో ఫెడరర్ ఒకదశలో 4–8తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచాడు.
అయితే ఫెడరర్ కీలకదశలో అద్భుతంగా ఆడి వరుసగా ఆరు పాయింట్లు సాధించి విజయాన్ని దక్కించుకొని ఊపిరి పీల్చుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్రలో ఫెడరర్‌కిది 100వ విజయం కావడం విశేషం. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో రావ్‌నిచ్ (కెనడా) 7–5, 6–4, 7–6 (7/2)తో ఆరో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)పై, సిలిచ్ (క్రొయేíÙయా) 6–7 (3/7), 6–4, 6–0, 5–7, 6–3తో తొమ్మిదో సీడ్ అగుట్ (స్పెయిన్)పై గెలిచారు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో దివిజ్ శరణ్ (భారత్)–సితాక్ (న్యూజిలాండ్) జంట 6–7 (2/7), 3–6తో మ్యాట్ పావిచ్ (క్రొయోషీయా)–బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జోడీ చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment