గత నెల్లో తల్లి.. ఈ నెల్లో పెళ్లి! | Serena Williams and Alexis Ohanian plan their WEDDING | Sakshi
Sakshi News home page

గత నెల్లో తల్లి.. ఈ నెల్లో పెళ్లి!

Published Sun, Oct 22 2017 12:49 PM | Last Updated on Sun, Oct 22 2017 2:04 PM

Serena Williams and Alexis Ohanian plan their WEDDING

న్యూయార్క్:నల్లకలువ, టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ పెళ్లికి సిద్ధమవుతోంది. గత నెలలో పండంటి పాపకు జన్మినిచ్చి మాతృత్వంలోని మధురానుభూతులను ఆస్వాదిస్తున్న సెరెనా.. ఈ నెలాఖరులో వివాహం చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ప్రియుడు మిలియనీర్ అలెక్సిస్ ఒహానియన్ తో  ఇప్పటికే నిశ్చితార్థం కాగా, ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కేందుకు సన్నద్దమవుతోంది.

తమ పెళ్లికి సంబంధించి పెద్ద ఎత్తున అతిథులను ఆహ్వానించాలని నిర్ణయించుకున్న సెరెనా-అలెక్స్ లు ఇందుకు జాబితాను సిద్ధం చేసే పనిలో పడ్డారు. వివాహ ప్లాన్ కోసం ఇద్దరూ కలిసి ప్రత్యేక విమానంలో న్యూ ఓర్లాండో వెళ్లి అక్కడి మెర్లిన్ రెస్టారెంట్ లో వెడ్డింగ్ ప్లానర్ తో చర్చలు జరపుతున్నారు. ఈ మేరకు వారి పెళ్లి ముహూర్తం ఈనెల చివర్లో పెట్టుకునేందుకు సన్నాహలు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement