Alexis Ohanian
-
‘నా కూతురికి సమాధానం చెప్పగలగాలి’
వాషింగ్టన్: సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ రెడిట్ కో ఫౌండర్, టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ భర్త అలెక్సిస్ ఒహానియాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. ఆ స్థానంలో ఓ నల్ల జాతీయుడిని నియమించాలని కోరారు. ఆన్లైన్ పోస్ట్‌లో తన రాజీనామా గురించి తెలిపారు ఒహానియాన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నువ్వు ఏం చేస్తున్నావు అని దీని గురించి భవిష్యత్తులో నా కుమార్తె ప్రశ్నించినప్పుడు.. నేను సమాధానం చెప్పగలగాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని తెలిపారు. ఒహానియాన్, సెరెనా విలియమ్స్ మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది. (హ్యాండ్సప్.. డోంట్ షూట్!) జాతి విద్వేషాలను అరికట్టడమే కాక నల్లజాతి సమాజానికి సేవ చేయడానికి సంస్థలో తన వాటాపై భవిష్యత్తులో వచ్చే లాభాలను ఉపయోగించుకుంటానని అలెక్సిస్ ఒహానియాన్ తెలిపారు. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని అమెరికా పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ హత్యోదంతంపై అమెరికాలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒహానియాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక మాజీ ఎన్ఎఫ్ఎల్ స్టార్ కోలిన్ కైపెర్నిక్ యొక్క ‘నో యువర్ రైట్స్’ క్యాంప్‌కు మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. -
సెరెనా-ఒహానియన్ పెళ్లి సందడి
-
గత నెల్లో తల్లి.. ఈ నెల్లో పెళ్లి!
న్యూయార్క్:నల్లకలువ, టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ పెళ్లికి సిద్ధమవుతోంది. గత నెలలో పండంటి పాపకు జన్మినిచ్చి మాతృత్వంలోని మధురానుభూతులను ఆస్వాదిస్తున్న సెరెనా.. ఈ నెలాఖరులో వివాహం చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ప్రియుడు మిలియనీర్ అలెక్సిస్ ఒహానియన్ తో ఇప్పటికే నిశ్చితార్థం కాగా, ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కేందుకు సన్నద్దమవుతోంది. తమ పెళ్లికి సంబంధించి పెద్ద ఎత్తున అతిథులను ఆహ్వానించాలని నిర్ణయించుకున్న సెరెనా-అలెక్స్ లు ఇందుకు జాబితాను సిద్ధం చేసే పనిలో పడ్డారు. వివాహ ప్లాన్ కోసం ఇద్దరూ కలిసి ప్రత్యేక విమానంలో న్యూ ఓర్లాండో వెళ్లి అక్కడి మెర్లిన్ రెస్టారెంట్ లో వెడ్డింగ్ ప్లానర్ తో చర్చలు జరపుతున్నారు. ఈ మేరకు వారి పెళ్లి ముహూర్తం ఈనెల చివర్లో పెట్టుకునేందుకు సన్నాహలు చేస్తున్నారు. -
సెరెనా విలియమ్స్‌కు కూతురు పుట్టింది
సాక్షి, వాషింగ్టన్: టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఇంట సందడి నెలకొంది. టెన్నిస్ నంబర్ వన్ ఛాంపియన్ అయిన సెరెనా విలియమ్స్ కాబోయే భర్త అలెక్సిస్ ఒహనియన్ ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఫ్లోరిడా వెస్ట్ పామ్ బీచ్ లోని ఓ మెడికల్ సెంటర్ లో శుక్రవారం రాత్రి ఆమెకు పాప పుట్టినట్లు కటుంబ సభ్యులు తెలిపారు. బిడ్డ ఆరోగ్యవంతంగా ఉన్నట్లు వాళ్లు వెల్లడించారు. దీంతో సోషల్ మీడియాలో సెరెనాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరో టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలియజేయగా, హాలీవుడ్ సింగర్ బేవొన్స్ సెరెనా గర్భవతిగా ఉన్న ఓ ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి విష్ చేసింది. ఏప్రిల్‌లో తాను 20 వారాల గర్భవతినన్న విషయం స్నాప్‌ఛాట్ ద్వారా స్విమ్‌సూట్‌తో మరీ సెరెనా ప్రకటించిన విషయం తెలిసిందే. బిడ్డ పుట్టాకే సెరెనా, అలెక్సిస్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు కూడా. -
టెన్నిస్ సూపర్ స్టార్ స్పెషల్ న్యూస్
వాషింగ్టన్: టెన్నిస్ సూపర్ స్టార్ సెరెనా విలియమ్స్ స్పెషల్ న్యూస్ చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్టు వెల్లడించింది. త్వరలోనే పండంటి బిడ్డను ప్రసవించనుంది. తాను గర్భం దాల్చిన విషయాన్ని ధ్రువీకరిస్తూ స్నాప్ చాట్ లో సెరెనా సెల్ఫీ పోస్టు చేసింది. దీనిపై '20 వారాలు' అని క్యాప్షన్ పెట్టింది. దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తం కావడంతో వెంటనే ఈ సెల్ఫీని తొలగించింది. గర్భంతో ఉన్న సెరెనా ఈ ఏడాది ఇక బరిలోకి దిగే అవకాశం లేదని ఆమె తరపు ప్రతినిధి కెలీ బుష్ నోవాక్ తెలిపారు. వచ్చే ఏడాది ఆమె మళ్లీ ఆడుతుందని చెప్పారు. ఇంటర్నెట్లో సామాజిక వార్తల కలబోతగా చెప్పుకునే రెడిట్ వెబ్సైట్ సహ వ్యవస్థాపకుడు 32 ఏళ్ల అలెక్సిస్ ఒహానియాన్తో గతేడాది డిసెంబర్ లో సెరెనాకు నిశ్చితార్థం జరిగింది. 35 ఏళ్ల సెరెనా ఇప్పటివరకు 23 గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ టైటిళ్లు గెలిచింది. జనవరి 28న ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలిచే సమయానికే ఆమె రెండు మాసాల గర్భవతిగా ఉన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ లో 36వ యేట అడుగుపెట్టబోతున్న ఈ 'నల్లకలువ' వచ్చే వారం ప్రకటించనున్న టెన్నిస్ ర్యాంకింగ్స్ లో మళ్లీ టాప్ ర్యాంకు దక్కించుకునే అవకాశాలున్నాయి.