సెరెనా విలియమ్స్‌కు కూతురు పుట్టింది | Serena Williams gives birth to baby girl | Sakshi

సెరెనా విలియమ్స్‌కు కూతురు పుట్టింది

Sep 2 2017 8:13 AM | Updated on Sep 17 2017 6:18 PM

సెరెనా విలియమ్స్‌కు కూతురు పుట్టింది

సెరెనా విలియమ్స్‌కు కూతురు పుట్టింది

టెన్నిస్‌ స్టార్, నల్ల కలువ సెరెనా విలియమ్స్‌ పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది.

సాక్షి, వాషింగ్టన్‌: టెన్నిస్‌ స్టార్ సెరెనా విలియమ్స్‌ ఇంట సందడి నెలకొంది. టెన్నిస్‌ నంబర్ వన్‌ ఛాంపియన్‌ అయిన సెరెనా విలియమ్స్ కాబోయే భర్త అలెక్సిస్‌ ఒహనియన్‌ ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
 
ఫ్లోరిడా వెస్ట్‌ పామ్‌ బీచ్ లోని ఓ మెడికల్ సెంటర్‌ లో శుక్రవారం రాత్రి ఆమెకు పాప పుట్టినట్లు కటుంబ సభ్యులు తెలిపారు. బిడ్డ ఆరోగ్యవంతంగా ఉన్నట్లు వాళ్లు వెల్లడించారు. దీంతో సోషల్‌ మీడియాలో సెరెనాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరో టెన్నిస్ స్టార్ రఫెల్‌ నాదల్‌ ట్విట్టర్‌ లో శుభాకాంక్షలు తెలియజేయగా, హాలీవుడ్ సింగర్ బేవొన్స్ సెరెనా గర్భవతిగా ఉన్న ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసి విష్‌ చేసింది.
 
ఏప్రిల్‌లో తాను 20 వారాల గర్భవతినన్న విషయం స్నాప్‌ఛాట్‌ ద్వారా స్విమ్‌సూట్‌తో మరీ సెరెనా ప్రకటించిన విషయం తెలిసిందే. బిడ్డ పుట్టాకే సెరెనా, అలెక్సిస్‌ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement