టెన్నిస్ సూపర్ స్టార్ స్పెషల్ న్యూస్ | Tennis superstar Serena Williams confirms pregnancy | Sakshi
Sakshi News home page

టెన్నిస్ సూపర్ స్టార్ స్పెషల్ న్యూస్

Apr 20 2017 11:03 AM | Updated on Sep 5 2017 9:16 AM

టెన్నిస్ సూపర్ స్టార్ స్పెషల్ న్యూస్

టెన్నిస్ సూపర్ స్టార్ స్పెషల్ న్యూస్

టెన్నిస్ సూపర్ స్టార్ సెరెనా విలియమ్స్ స్పెషల్ న్యూస్ చెప్పింది.

వాషింగ్టన్: టెన్నిస్ సూపర్ స్టార్ సెరెనా విలియమ్స్ స్పెషల్ న్యూస్ చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్టు వెల్లడించింది. త్వరలోనే పండంటి బిడ్డను ప్రసవించనుంది. తాను గర్భం దాల్చిన విషయాన్ని ధ్రువీకరిస్తూ స్నాప్ చాట్ లో సెరెనా సెల్ఫీ పోస్టు చేసింది. దీనిపై '20 వారాలు' అని క్యాప్షన్ పెట్టింది. దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తం కావడంతో వెంటనే ఈ సెల్ఫీని తొలగించింది.

గర్భంతో ఉన్న సెరెనా ఈ ఏడాది ఇక బరిలోకి దిగే అవకాశం లేదని ఆమె తరపు ప్రతినిధి కెలీ బుష్ నోవాక్ తెలిపారు. వచ్చే ఏడాది ఆమె మళ్లీ ఆడుతుందని చెప్పారు. ఇంటర్నెట్‌లో సామాజిక వార్తల కలబోతగా చెప్పుకునే రెడిట్‌ వెబ్‌సైట్‌ సహ వ్యవస్థాపకుడు 32 ఏళ్ల అలెక్సిస్‌ ఒహానియాన్‌తో గతేడాది డిసెంబర్ లో సెరెనాకు నిశ్చితార్థం జరిగింది.

35 ఏళ్ల సెరెనా ఇప్పటివరకు 23 గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ టైటిళ్లు గెలిచింది. జనవరి 28న ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలిచే సమయానికే ఆమె రెండు మాసాల గర్భవతిగా ఉన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ లో 36వ యేట అడుగుపెట్టబోతున్న  ఈ 'నల్లకలువ' వచ్చే వారం ప్రకటించనున్న టెన్నిస్ ర్యాంకింగ్స్ లో మళ్లీ టాప్ ర్యాంకు దక్కించుకునే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement