న్యూయార్క్: డిఫెండింగ్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ మరో అలవోక విజయంతో యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ స్లోన్ 6–3, 6–3తో 15వ సీడ్ ఎలీజ్ మెర్‌టెన్స్ (బెల్జియం)పై గెలిచింది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్లోన్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు ఆరుసార్లు చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా), గతేడాది రన్నరప్, 14వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా), ఎనిమిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టగా... ఏడో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) ఇంటిదారి పట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సెరెనా గంటా 37 నిమిషాల్లో 6–0, 4–6, 6–3తో కయి కనెపి (ఎస్తోనియా)పై, ప్లిస్కోవా 6–4, 6–4తో యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)పై, మాడిసన్ కీస్ 6–1, 6–3తో 29వ సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా)పై గెలిచారు. స్వితోలినా 3–6, 6–1, 0–6తో 19వ సీడ్ సెవస్తోవా (లాత్వియా) చేతిలో ఓటమి పాలైంది.
నాదల్ ముందంజ...
పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), మూడో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా), తొమ్మిదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), 11వ సీడ్ జాన్ ఇస్నెర్ (అమెరికా), మాజీ రన్నరప్ నిషికోరి (జపాన్) క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో నాదల్ 6–3, 6–3, 6–7 (6/8), 6–4తో బాసిలాష్‌విలి (జార్జియా)పై, డెల్ పొట్రో 6–4, 6–3, 6–1తో బొర్నా కొరిచ్ (క్రొయేషియా)పై, థీమ్ 7–5, 6–2, 7–6 (7/2)తో ఐదో సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై, ఇస్నెర్ 3–6, 6–3, 6–4, 3–6, 6–2తో రావ్‌నిచ్ (కెనడా)పై, నిషికోరి 6–3, 6–2, 7–5తో కోల్‌ష్రైబర్ (జర్మనీ)పై విజయం సాధించారు.
పురుషుల డబుల్స్ మూడో రౌండ్‌లో రోహన్ బోపన్న (భారత్)–వాసెలిన్ (ఫ్రాన్స్) జంట 7–6 (8/6), 4–6, 6–3తో జెరెమి చార్డీ–ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్) జోడీపై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది.
క్వార్టర్స్‌లో స్లోన్ స్టీఫెన్స్,సెరెనా
Published Tue, Sep 4 2018 1:13 AM | Last Updated on Tue, Sep 4 2018 1:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment