US Open women singles
-
US Open 2024: సభలెంకా... విజయ ఢంకా
న్యూయార్క్: గత మూడేళ్లుగా ఊరిస్తున్న యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను బెలారస్ స్టార్ అరీనా సబలెంకా నాలుగో ప్రయత్నంలో సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా 7–5, 7–5తో ప్రపంచ ఆరో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా)పై గెలిచింది. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సబలెంకా కీలకదశలో పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. విజేతగా నిలిచిన సబలెంకాకు 36 లక్షల డాలర్లు (రూ. 30 కోట్ల 23 లక్షలు), రన్నరప్ జెస్సికా పెగూలాకు 18 లక్షల డాలర్లు (రూ. 15 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ టోర్నీలో గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సబలెంకా 2021, 2022లలో సెమీఫైనల్లో ని్రష్కమించింది. తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన పెగూలా అనుభవరాహిత్యంతో ఓటమి పాలైంది. తొలి సెట్ కోల్పోయినప్పటికీ రెండో సెట్లో కోలుకున్న పెగూలా 5–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. మరో గేమ్ గెలిచిఉంటే పెగూలా రెండో సెట్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచేది. కానీ కెరీర్లో నాలుగో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న సబలెంకా తన ప్రత్యర్థికి అలాంటి అవకాశం ఇవ్వలేదు. ఒక్కసారిగా విజృంభించిన ఈ బెలారస్ స్టార్ వరుసగా నాలుగు గేమ్‌లు గెల్చుకొని 7–5తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. సబలెంకా కెరీర్లో ఇది మూడో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్. 2023, 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన సబలెంకా తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకుంది. 2019లో నాన్న చనిపోయాక మా ఇంటìæపేరును టెన్నిస్ చరిత్రలో భాగంగా చేయాలనే లక్ష్యంతో ముందుకుసాగాను. నా టెన్నిస్ ప్రయాణం నిరాటంకంగా, ఎల్లవేళలా కొనసాగేందుకు నా కుటుంబ సభ్యులు ఎంతో కృషి చేశారు. గత మూడేళ్లుగా ఈ టోరీ్నలో నేను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. టోర్నీలలో విన్నర్స్ ట్రోఫీపై నా పేరు చూసుకుంటున్నపుడు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. –సబలెంకా -
G.O.A.T అని ఇలా కూడా పిలవొచ్చా.. వారెవ్వా!
అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. 27 ఏళ్ల కెరీర్లో చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సెరెనా.. అందుకు తగ్గ ఆటతీరునే ప్రదర్శిస్తోంది. బుధవారం అర్థరాత్రి తర్వాత జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో వరల్డ్ నెంబర్-2 అనెట్ కొంటావెయిట్కు షాక్ ఇచ్చిన సెరెనా అద్భుత ప్రదర్శనతో 24వ టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది. తొలి సెట్ టై బ్రేక్‌లో నెగ్గిన సెరెనా.. రెండో సెట్‌ను కోల్పోయి కూడా ఫుంజుకున్న తీరు అద్భుతమనే చెప్పొచ్చు. పాత సెరెనాను తలపిస్తూ విజృంభించిన ఆమె సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే క్రీడల్లో ఆల్‌టైమ్ గ్రేట్‌ను G.O.A.T (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అని పిలుస్తుంటారు. ఇప్పటికే G.O.A.Tగా పిలవబడుతున్న సెరెనాను ఎన్బీఏ(బాస్కెట్‌బాల్) చాంపియన్ లెబ్రన్ జేమ్స్ తనదైన శైలిలో సంబోధించడం వైరల్‌గా మారింది. సెరెనా మ్యాచ్‌ను టీవీలో వీక్షించిన లెబ్రన్ జేమ్స్.. ఆమె మ్యాచ్ గెలిచిన అనంతరం GOAT పదం ఉచ్చరించేలా.. మేక శబ్ధం అయిన ''మే.. మే..'' అని అరిచాడు. ఒక రకంగా సెరెనా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ G.O.A.T అనే పదాన్ని తనదైన స్టైల్లో పిలిచి ఆమె గౌరవాన్ని మరింత పెంచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. LeBron making goat sounds at Serena 😂🐐 (h/t @AhnFireDigital) pic.twitter.com/mpvhmLkU7s — NBACentral (@TheNBACentral) September 1, 2022 చదవండి: వరల్డ్ నెంబర్-2కు షాక్.. మూడో రౌండ్‌కు దూసుకెళ్లిన నల్లకలువ నాడు కోహ్లి వర్సెస్ సూర్య! ఇప్పుడు సూర్యకు విరాట్ ఫిదా! తలవంచి మరీ! వైరల్ -
రెండో రౌండ్‌కు దూసుకెళ్లిన సెరెనా
న్యూయార్క్: కెరీర్లో చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్నట్లు ప్రకటించిన అమెరికా నల్లకలువ, టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్.. యూఎస్ ఓపెన్ 2022లో రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సెరెనా.. మాంటెనెగ్రోకు చెందిన డంకా కొవినిక్‌పై 6-3, 6-3 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. That winning feeling. #Serena pic.twitter.com/xJ4YUdi1Fj— US Open Tennis (@usopen) August 30, 2022 కెరీర్లో 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన 40 ఏళ్ల సెరెనా.. తొలి రౌండ్లో ఏమాత్రం తడబాటుకు గురికాకుండా ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. సెరెనా కెరీర్లో ఇదే చివరి మ్యాచ్ అవుతుందేమోనని ఆమె అభిమానులు స్టేడియం వద్ద బారులు తీరారు. ఆర్థర్ యాష్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ను దాదాపు 23000 మంది వీక్షించినట్లు నిర్వహకులు తెలిపారు. #TwirlForSerena pic.twitter.com/RCoCSeGB0y — US Open Tennis (@usopen) August 30, 2022 మాజీ వరల్డ్ నంబర్ 1, ప్రస్తుత 605వ ర్యాంకర్ అయిన సెరెనా తొలి రౌండ్లో తన కంటే చాలా మెరుగైన ర్యాంకర్ డంకా కొవినిక్ (80వ ర్యాంక్)పై అలవోకగా విజయం సాధించడంతో ఆమె అభిమానులు ఆనందంలో మునిగితేలారు. తమ ఆరాధ్య క్రీడాకారిణి మరో గ్రాండ్‌స్లామ్ నెగ్గి, అత్యధిక సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన క్రీడాకారిణిగా మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా–24 టైటిల్స్) రికార్డును సమం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఈ మ్యాచ్‌తో పాటు కేవలం రెండే మ్యాచ్‌లు గెలిచిన సెరెనా.. రెండో రౌండ్లో వరల్డ్ నంబర్ 2 ఎస్టోనియాకు చెందిన అన్నెట్ కొంటావెట్ను ఢీకొట్టాల్సి ఉంది. చదవండి: US Open 2022: సెరెనాపైనే దృష్టి -
కరోనా బారిన పడిన యూఎస్ ఓపెన్ ఛాంపియన్
Emma Raducanu Tests Positive For Covid: యూఎస్ ఓపెన్ మహిళల డిఫెండింగ్ ఛాంపియన్, బ్రిటన్ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి ఎమ్మా రాడుకాను కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అతి పిన్న వయసులోనే యూఎస్ ఓపెన్ టైటిల్‌ను ఎగురేసుకుపోయి చరిత్ర సృష్టించిన ఎమ్మా.. ఈ వారం అబుదాబిలో ప్రారంభమయ్యే ముబాదల ప్రపంచ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఈవెంట్లో పాల్గొనాల్సి ఉంది. అయితే, కరోనా సోకడంతో ఆమె ఆ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఎమ్మా పేర్కొంది. చదవండి: IND Vs SA: దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ.. టెస్ట్‌లకు స్టార్ ప్లేయర్ దూరం -
ఎమ్మా రాడుకాను ఆట చూడతరమా
-
గెలుపును ఊహించని విజేతలు వీళ్లు
-
యూఎస్ ఓపెన్ : మహిళల సింగిల్స్‌లో బ్రిటిష్ యువకెరటం ఎమ్మారెడుకాను చరిత్ర సృష్టించింది
-
టెన్నిస్ చరిత్రలో పెనుసంచలనం
US Open 2021 Winner Emma Raducanu: టెన్నిస్ చరిత్రలో పెనుసంచలనం చోటు చేసుకుంది. యూఎస్ ఓపెన్ ఫైనల్లో పద్దెనిమిదేళ్ల ఎమ్మా రెడుకాను విజేతగా ఆవిర్భవించింది. ఈ బ్రిటిష్ టెన్నిస్ సెన్సేషన్.. 19 ఏళ్ల కెనడా ప్లేయర్ లేలా ఫెర్నాండెజ్‌ను 6-4, 6-3 తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. న్యూయార్క్‌లోని కరోనా పార్క్ ‘అర్థర్ ఆషే స్టేడియం’లో భారత కాలమానం ప్రకారం.. శనివారం అర్ధరాత్రి దాటాక(ఆదివారం ఉదయం) US Open 2021 మహిళల ఫైనల్ మ్యాచ్ జరిగింది. సెట్ కూడా ఓడిపోకుండా టీనేజర్ ఎమ్మా రెడుకాను మ్యాచ్‌పై పట్టు సాధించి గెలుపును ఖాతాలో వేసుకుంది. అత్యంత చిన్నవయస్సులోనే గ్రాండ్‌స్లామ్ వేటలో ఫైనల్లో విజేతగా ఆవిర్భవించింది. అంతేకాదు ఈ గ్రాండ్ విక్టరీతో తన కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. గతంలో మరియా షరపోవా(17 ఏళ్ల వయసులో వింబుల్డన్ విజేత- 2004) తర్వాత ఏదేని ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఈ రికార్డు సాధించిన టీనేజర్‌గా గుర్తింపు ఇప్పుడు ఎమ్మా ఘనత దక్కించుకుంది. Hanging out with ESPN 😎📺 pic.twitter.com/QpIX2TgDvs — US Open Tennis (@usopen) September 12, 2021 కాగా, ఎమ్మా రెడుకాను కెరీర్లో ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ విజయాలేవీ లేకపోవడం విశేషం. ఈ నేపథ్యంలో ఆమె సక్సెస్ గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే బ్రిటిష్ ప్లేయర్ వర్జీనియా వేడ్ 1977లో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ నెగ్గిన తర్వాత ఇప్పుడు.. ఎమ్మా రెడుకాను ఈ ఘనత సాధించింది. Emma lifts the trophy for the fans outside Arthur Ashe stadium #EmmaRaducanu #USOpen2021 pic.twitter.com/8FwLeB4le4 — Sarah Gough (@sarahgoughy) September 11, 2021 చదవండి: స్వర్ణ పతక విజేతను ఓడించి.. ఫైనల్లో జొకోవిచ్ -
సెరెనా అదిరెన్...
తనకెంతో కలిసొచ్చిన వేదికపై అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ శుభారంభం చేసింది. మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ (24) ఆల్‌టైమ్ రికార్డును సమం చేసేందుకు మళ్లీ ప్రయత్నిస్తున్న 38 ఏళ్ల సెరెనా ఈ క్రమంలో కొత్త రికార్డును సృష్టించింది. యూఎస్ ఓపెన్ టోర్నమెంట్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌ల్లో విజయాలు అందుకున్న ప్లేయర్‌గా సెరెనా ఘనత వహించింది. 101 విజయాలతో అమెరికాకే చెందిన మరో దిగ్గజం క్రిస్ ఎవర్ట్ పేరిట ఇన్నాళ్లూ ఉన్న రికార్డును 102వ విజయంతో సెరెనా బద్దలు కొట్టింది. 1998లో తొలిసారి యూఎస్ ఓపెన్‌లో ఆడిన సెరెనా ఈ మెగా టోర్నీలో ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచింది. ఈసారీ సెరెనా గెలిస్తే అత్యధికసార్లు యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన క్రీడాకారిణిగా క్రిస్ ఎవర్ట్ (6 సార్లు) పేరిటే ఉన్న రికార్డును సవరించి చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. న్యూయార్క్: కరోనా వైరస్ భయంతో యూఎస్ ఓపెన్ టోర్నీకి టాప్–10లోని ఆరుగురు క్రీడాకారిణులు గైర్హాజరీ అయిన స్థితిలో... అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని... చరిత్రలో స్థానం సంపాదించేందుకు అమెరికా మహిళా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తొలి అడుగు వేసింది. గత రెండేళ్లలో ఫైనల్‌కు చేరుకొని రన్నరప్ ట్రోఫీతోనే సరిపెట్టుకున్న సెరెనా ఈసారి మాత్రం ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ సెరెనా 7–5, 6–3తో తన దేశానికే చెందిన క్రిస్టీ ఆన్‌పై విజయం సాధించింది. 81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లోసెరెనా 13 ఏస్‌లు సంధించింది. కెరీర్లో 20వసారి యూఎస్ ఓపెన్‌లో ఆడుతున్న సెరెనా తాజా గెలుపుతో ఈ మెగా టోర్నీ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్‌గా (పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాలు కలిపి) తనకంటూ ప్రత్యేక స్థానాన్ని లిఖించుకుంది. 101 విజయాలతో క్రిస్ ఎవర్ట్ (అమెరికా) పేరిట ఉన్న ఈ రికార్డును సెరెనా అధిగమించింది. ఒకవేళ సెరెనా ఈసారి చాంపియన్‌గా నిలిస్తే అత్యధికంగా ఏడుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పుతుంది. 1998లో ఈ టోర్నీలో అరంగేట్రం చేసిన సెరెనా ఆరుసార్లు విజేతగా (1999, 2002, 2008, 2012, 2013, 2014)... నాలుగుసార్లు రన్నరప్‌గా (2001, 2011, 2018, 2019) నిలిచింది. 2003, 2017లలో సెరెనా ఈ టోర్నీలో ఆడలేదు. యూఎస్ ఓపెన్‌కు సన్నాహాల్లో భాగంగా రెండు టోర్నీలు ఆడిన సెరెనా రెండింటిలోనూ క్వార్టర్ ఫైనల్ దాటలేదు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఆమె మూడు సెట్లపాటు పోరాడాల్సి వచ్చింది. ‘యూఎస్ ఓపెన్‌లో ఆడేందుకు వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక రికార్డు బద్దలు కొట్టానని నాతో చెబుతుంటారు. అయితే నేనెప్పుడూ రికార్డుల కోసం ఆడలేదు. వాటి గురించి ఆలోచించడంలేదు. టైటిల్ గెలవడమే నా ముందున్న లక్ష్యం’ అని సెరెనా వ్యాఖ్యానించింది. మాజీ చాంపియన్ క్లియ్‌స్టర్స్‌కు నిరాశ... ఎనిమిదేళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పునరాగమనం చేసిన మూడుసార్లు యూఎస్ ఓపెన్ చాంపియన్ కిమ్ క్లియ్‌స్టర్స్ (బెల్జియం)కు నిరాశ ఎదురైంది. తొలి రౌండ్లో 37 ఏళ్ల క్లియ్‌స్టర్స్ 6–3, 5–7, 1–6తో ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) 6–2, 6–2తో విక్‌మాయెర్ (బెల్జియం)పై, తొమ్మిదో సీడ్ యోహానా కొంటా (బ్రిటన్) 7–6 (9/7), 6–1తో హీథెర్ వాట్సన్ (బ్రిటన్)పై, ఐదో సీడ్ సబలెంకా (బెలారస్) 7–6 (7/1), 6–4తో ఒషీన్ డోడిన్ (ఫ్రాన్స్)పై, ఏడో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–1, 6–1తో తిమియా బాబోస్ (హంగేరి)పై, ప్రపంచ మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్) 6–1, 6–2తో బార్బరా హాస్ (ఆస్ట్రియా)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్లో కెర్బర్, క్విటోవా.... మహిళల సింగిల్స్‌లో మాజీ విజేత కెర్బర్ (జర్మనీ), ఆరో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్), ఎనిమిదో సీడ్ పెట్రా మార్టిక్ (క్రొయేషియా), 14వ సీడ్ అనెట్ కొంటావె (ఎస్తోనియా) మూడో రౌండ్లోకి చేరారు. రెండో రౌండ్లో కెర్బర్ 6–3, 7–6 (8/6)తో ఫ్రీడ్సామ్ (జర్మనీ)పై, మార్టిక్ 6–3, 6–4తో కాటరీనా బొండారెంకో (ఉక్రెయిన్)పై, కొంటావె 6–4, 6–1తో కయా యువన్ (స్లొవేనియా)పై, క్విటోవా 7–6 (7/3), 6–2తో కొజ్లోవా (ఉక్రెయిన్)పై గెలిచారు. అయితే 12వ సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 1–6, 2–6తో సస్నోవిచ్ (బెలారస్) చేతిలో... 30వ సీడ్ మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) 6–1, 6–7 (2/7), 0–6తో గ్రషెవా (రష్యా) చేతిలో ఓడిపోయారు. వీనస్ రికార్డు... అత్యధికసార్లు యూఎస్ ఓపెన్‌లో ఆడిన క్రీడాకారిణిగా వీనస్ విలియమ్స్ (అమెరికా) రికార్డు సృష్టించింది. సెరెనా అక్క అయిన 40 ఏళ్ల వీనస్ యూఎస్ ఓపెన్‌లో 22వసారి బరిలోకి దిగింది. అయితే ఆమెకు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 7–5తో వీనస్‌ను ఓడించింది. ఇప్పటిదాకా మార్టినా నవ్రతిలోవా (21 సార్లు) పేరిట ఉన్న రికార్డును వీనస్ సవరించింది. ముర్రే అద్భుతం... పురుషుల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్) అద్భుత విజయం సాధించాడు. దాదాపు 20 నెలల తర్వాత తొలి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ ఆడిన ముర్రే 4–6, 4–6, 7–6 (7/5), 7–6 (7/4), 6–4తో యోషిహిటో నిషియోక (జపాన్)పై గెలుపొందాడు. 4 గంటల 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే తొలి రెండు సెట్లు కోల్పోయి ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి ఊపిరి పీల్చుకున్నాడు. వరుసగా రెండు సెట్లు చేజార్చుకున్నాక విజయాన్ని అందుకోవడం ముర్రే కెరీర్లో ఇది పదోసారి కావడం విశేషం. మూడో సీడ్ మెద్వెదేవ్ (రష్యా), రెండో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), ఎనిమిదో సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్), పదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) కూడా రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. దివిజ్ శరణ్ జంట ఓటమి పురుషుల డబుల్స్‌లో దివిజ్ శరణ్ (భారత్)–నికోలా కాచిచ్ (సెర్బియా) జంట తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. శరణ్–కాచిచ్ ద్వయం 4–6, 6–4, 3–6తో కూలాఫ్–మెక్టిక్ (క్రొయేషియా) జంట చేతిలో ఓడిపోయింది. -
ఎవరీ బియాంక..!
ఏడాది క్రితం వరకు టాప్–150లో కూడా లేని బియాంక నేడు గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరించింది. యూఎస్ ఓపెన్ చాంపియన్ కావాలని మూడేళ్ల క్రితమే బియాంక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2016లో ప్రతిష్టాత్మక జూనియర్ టోర్నీ ఆరెంజ్ బౌల్ టైటిల్ సాధించిన బియాంక... యూఎస్ ఓపెన్ చాంపియన్‌కు ఇచ్చే చెక్ ప్రతిని తయారు చేసుకొని దానిపై తన పేరును రాసుకుంది. మూడేళ్ల తర్వాత బియాంక ఏకంగా నిజమైన చెక్‌నే అందుకోవడం విశేషం. బియాంక తల్లిదండ్రులు మారియా, నికూ 1994లో రొమేనియా నుంచి కెనడాకు వలస వెళ్లి స్థిరపడ్డారు. 2000 జూన్ 16న టొరంటోలో బియాంక జన్మించింది. ఏడేళ్ల ప్రాయంలో రాకెట్ పట్టుకున్న బియాంక నాలుగేళ్ల తర్వాత కెనడా జాతీయ టెన్నిస్ ప్రోగ్రామ్‌లో భాగమైంది. కెరీర్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టింది. 2016లో రోజర్స్ కప్ టోర్నీ సందర్భంగా సిమోనా హలెప్ సూచనతో ప్రొఫెషనల్‌గా మారింది. తల్లి మారియా పర్యవేక్షణలో 12 ఏళ్ల ప్రాయం నుంచే ధ్యానం చేసే అలవాటు చేసుకున్న బియాంక 2017లో వింబుల్డన్ టోర్నీ మెయిన్ ‘డ్రా’లో అడుగుపెట్టి తొలి రౌండ్లో నిష్క్రమించింది. 2018లో నిలకడగా ఆడిన ఆమె ఈ ఏడాది మరింత రాటుదేలింది. ప్రీమియర్ ఈవెంట్ టోర్నీలైన ఇండియన్ వెల్స్ ఓపెన్, రోజర్స్ కప్ టోర్నీల్లో టైటిల్స్ గెలిచి యూఎస్ ఓపెన్‌లో అడుగు పెట్టింది. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ ఏకంగా గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచింది. గాయాల బారిన పడకుండా... తన ఆటను మరింత మెరుగుపర్చుకుంటే 2020లో బియాంక ఖాతాలో మరిన్ని టైటిల్స్ చేరే అవకాశముంది. -
వొజ్నియాకి నిష్క్రమణ
న్యూయార్క్: ఈ ఏడాది తన నిరాశాజనక ప్రదర్శన కొనసాగిస్తూ... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, 19వ సీడ్ క్రీడాకారిణి కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్) యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో 2009, 2014 రన్నరప్ వొజ్నియాకి 4–6, 4–6తో 16వ సీడ్ బియాంక ఆండ్రెస్కూ (కెనడా) చేతిలో ఓటమి చవిచూసింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్లలో మూడో రౌండ్లో వెనుదిరిగిన వొజ్నియాకి ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. మరోవైపు ఏడో సీడ్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) కూడా మూడో రౌండ్లోనే ఓడింది. జూలియా (జర్మనీ) 6–2, 6–3తో కికి బెర్టెన్స్ను ఓడించింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ సెరెనా (అమెరికా) 6–3, 6–2తో ముచోవా (చెక్ రిపబ్లిక్)పై, రెండో సీడ్ బార్టీ (ఆస్ట్రేలియా) 7–5, 6–3తో సకారి (గ్రీస్)పై, పదో సీడ్ కీస్ (అమెరికా) 6–3, 7–5తో సోఫియా(అమెరికా)పై గెలిచారు. నిషికోరికి షాక్ పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో ఏడో సీడ్ నిషికోరి (జపాన్) 2–6, 4–6, 6–2, 3–6తో డి మినార్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడి పోయాడు. టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6–3, 6–4, 6–2తో డెనిస్ కుడ్లా (అమెరికా) పై, ఐదో సీడ్ మెద్వెదేవ్ (రష్యా) 7–6 (7/1), 4–6, 7–6 (9/7), 6–4తో లోపెజ్ పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరారు. -
క్విటోవాకు చుక్కెదురు
న్యూయార్క్: ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో మరో సంచలనం నమోదైంది. ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్, ఆరో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ఆమె 4–6, 4–6తో ప్రపంచ 88వ ర్యాంకర్ పెట్కొవిక్ (జర్మనీ) చేతిలో ఓడిపోయింది. ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ యాష్లే బార్టీ, ఐదో సీడ్ స్వితోలినా, పదో సీడ్ మాడిసన్ కీస్ ముందంజ వేశారు. స్థానిక అక్కాచెల్లెళ్లకు మిశ్రమ ఫలితాలొచ్చాయి. అక్క వీనస్ విలియమ్స్ ఆట ముగియగా, చెల్లి సెరెనా విలియమ్స్ మూడో రౌండ్లోకి ప్రవేశించింది. రెండో సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6–2, 7–6 (7/2)తో అమెరికాకు చెందిన లారెన్‌పై చెమటోడ్చి నెగ్గింది. ఏడో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) ఏడు సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ అయిన వీనస్‌ను 6–4, 6–4తో ఓడించింది. 2017 రన్నరప్ కీస్ (అమెరికా) 6–4, 6–1తో జు లిన్ (చైనా)పై గెలిచింది. 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి మెక్నాలీ అమెరికన్ స్టార్ సెరెనా విలియమ్స్‌తో ఓ ఆటాడుకుంది. తొలిసెట్‌ను గెలిచి తమ దేశానికే చెందిన దిగ్గజానికి ముచ్చెమటలు పట్టించింది. రెండో సెట్లో కోలుకున్న అమెరికా నల్లకలువ 5–7, 6–3, 6–1తో మెక్నాలీ (అమెరికా)పై గెలిచి ఊపిరి పీల్చుకుంది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ 6–4, 7–6 (7/3), 6–1తో 56వ ర్యాంకర్ ఇగ్నాసియో (అర్జెంటీనా)పై గెలిచాడు. మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 3–6, 6–2, 6–3, 6–4తో జుమ్హుర్ (బోస్నియా)పై నెగ్గాడు. -
గట్టెక్కిన బార్టీ, ప్లిస్కోవా
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 4–6, 1–6, 2–6తో ప్రపంచ ఐదో ర్యాంకర్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. తొలి రౌండ్లో ఓడిన ప్రజ్నేశ్‌కు 58,000 డాలర్ల (రూ. 41 లక్షల 62 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో రెండో సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), మూడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్లోకి ప్రవేశించారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఈ ఇద్దరు మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణులకు తమ ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచిన బార్టీ గంటా 41 నిమిషాల్లో 1–6, 6–3, 6–2తో జరీనా దియాస్ (కజకిస్తాన్)పై గెలుపొందగా... 2016 యూఎస్ ఓపెన్ రన్నరప్ ప్లిస్కోవా గంటా 46 నిమిషాల్లో 7–6 (8/6), 7–6 (7/3)తో తన దేశానికే చెందిన తెరెజా మార్టిన్కోవాను ఓడించింది. దియాస్తో జరిగిన మ్యాచ్‌లో బార్టీ ఎనిమిది ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. ఇతర మ్యాచ్‌ల్లో 16వ సీడ్ జొహానా కొంటా (బ్రిటన్) 6–1, 4–6, 6–2తో కసత్కినా (రష్యా)పై, 12వ సీడ్ సెవస్తోవా (లాత్వియా) 6–3, 6–3తో యూజిన్ బుషార్డ్ (కెనడా)పై గెలిచారు. 2016 రియో ఒలింపిక్స్ విజేత మోనికా పుయిగ్ (ప్యూర్టోరికో) 3–6, 3–6తో రెబెకా (స్వీడన్) చేతిలో... 2011 యూఎస్ ఓపెన్ విజేత సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) 1–6, 3–6తో ఎకతెరీనా (రష్యా) చేతిలో... 27వ సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–7 (8/10), 2–6తో ఓన్స్ జబీర్ (ట్యునీషియా) చేతిలో ఓడిపోయారు. -
నయోమి... నవ చరిత్ర
మహిళల టెన్నిస్‌లో మరో యువ తార అవతరించింది. తన ఆరాధ్య క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌తో జరిగిన ఫైనల్లో ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన జపాన్ అమ్మాయి నయోమి ఒసాకా విజేతగా నిలిచింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా ఆవిర్భవించింది. ఈ క్రమంలో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి జపాన్ ప్లేయర్‌గా కొత్త చరిత్ర సృష్టించింది. అయితే సెరెనా అనుచిత ప్రవర్తన ఒసాకా విజయానందాన్ని ఆవిరి చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కోచ్ నుంచి సంకేతాల రూపంలో సలహాలు అందుకుంటోందని చైర్ అంపైర్ సెరెనాకు తొలి హెచ్చరిక జారీ చేయడం... సెరెనా అసహనంతో రాకెట్ విరగ్గొట్టినందుకు రెండో హెచ్చరిక రూపంలో ప్రత్యర్థికి పాయింట్ ఇచ్చేయడం... ఆ తర్వాత తీవ్ర పదజాలంతో చైర్ అంపైర్‌ను దూషించినందుకు.. మూడో హెచ్చరిక రూపంలో సెరెనా గేమ్నే కోల్పోవడం... వెరసి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఒసాకా అద్భుత ఆటతీరు కాకుండా చివరకు సెరెనా అనుచిత ప్రవర్తనే హైలైట్ అయ్యింది. న్యూయార్క్: అద్భుతం జరిగింది. అంచనాలు తలకిందులయ్యాయి. కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించి రికార్డు సృష్టిస్తుందని భావించిన సెరెనా విలియమ్స్ భవిష్యత్ టెన్నిస్ తార చేతిలో బోల్తా పడింది. జపాన్ అమ్మాయి నయోమి ఒసాకా ధాటికి ఈ అమెరికా టెన్నిస్ దిగ్గజం చేతులెత్తేసింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో 20వ సీడ్ నయోమి ఒసాకా 6–2, 6–4తో 17వ సీడ్, ఆరుసార్లు చాంపియన్ సెరెనా విలియమ్స్‌ను ఓడించింది. ఈ క్రమంలో గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి జపాన్ ప్లేయర్‌గా కొత్త చరిత్ర సృష్టించింది. నా లీ (చైనా; 2011లో ఫ్రెంచ్ ఓపెన్, 2014లో ఆస్ట్రేలియన్ ఓపెన్) తర్వాత ఆసియా నుంచి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన రెండో ప్లేయర్‌గా 20 ఏళ్ల ఒసాకా గుర్తింపు పొందింది. విజేత ఒసాకాకు 38 లక్షల డాలర్లు (రూ. 27 కోట్ల 40 లక్షలు); రన్నరప్ సెరెనాకు 18 లక్షల 50 వేల డాలర్లు (రూ. 13 కోట్ల 34 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఫైనల్ చేరే క్రమంలో కేవలం ఒక సెట్ కోల్పోయిన ఒసాకా తుది పోరులోనూ పట్టుదలతో ఆడింది. 36 ఏళ్ల సెరెనాకు ప్రతి విభాగంలో ఆమె గట్టి జవాబు ఇచ్చింది. తన ప్రత్యర్థి అపార అనుభవజ్ఞురాలు అయినప్పటికీ... స్టేడియంలోని 24 వేల మంది ప్రేక్షకులు సెరెనా విజయమే కోరుకుంటునప్పటికీ... కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతోన్న ఈ జపాన్ అమ్మాయిపై ఆ అంశాలు ఎలాంటి ప్రభావం చూపలేదు. పక్కా వ్యూహంతో బరిలోకి దిగిన ఒసాకా కచ్చితమైన సర్వీస్‌లు... కళ్లు చెదిరేరీతిలో రిటర్న్ షాట్లు... శక్తివంతమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లతో సెరెనాకు ఊపిరి ఆడకుండా చేసింది. ఒకదశలో ఒసాకా కొట్టిన కొన్ని షాట్లను సెరెనా కూడా ప్రశంసించింది. మరోవైపు సెరెనాకు ఏదీ కలసి రాలేదు. గతి తప్పిన సర్వీస్‌లు.. డబుల్ ఫాల్ట్‌లు... అనవసర తప్పిదాలు... బ్రేక్ పాయింట్ అవకాశాలను వదులుకోవడం... ఇలా ఆమె ఏదశలోనూ ఒసాకాకు పోటీ ఇచ్చినట్టు అనిపించలేదు. తొలి సెట్లోని మూడో గేమ్‌లో, ఐదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఒసాకా తన సర్వీస్‌లను కాపాడుకొని 34 నిమిషాల్లో 6–2తో సెట్‌ను దక్కించుకుంది. వివాదం మొదలైందిలా... రెండో సెట్లో తన సర్వీస్‌లో తొలి గేమ్‌ను నెగ్గిన సెరెనా 1–0తో ముందంజ వేసింది. ఈ దశలో గ్యాలరీలో ఉన్న సెరెనా కోచ్ ప్యాట్రిక్ మురాతొగ్లు నిబంధనలకు విరుద్ధంగా సంకేతాల రూపంలో సలహాలు ఇస్తున్నారని గమనించిన చైర్ అంపైర్ కార్లోస్ రామోస్ (పోర్చుగల్) సెరెనాను హెచ్చరించారు. ఈ పరిణామానికి ఆశ్చర్యపోయిన సెరెనా చైర్ అంపైర్ రామోస్‌తో వాగ్వాదానికి దిగింది. ‘కోచ్ తనకు ఎలాంటి సంకేతాలు ఇవ్వడంలేదు. మోసపూరిత పద్ధతులతో గెలిచే బదులు నేను ఓడిపోవడానికి సిద్ధపడతాను’ అని రామోస్‌కు సెరెనా సమాధానం ఇచ్చింది. అనంతరం ఒసాకా తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో స్కోరు 1–1తో సమమైంది. ఆ తర్వాత సెరెనా కూడా గేమ్ నెగ్గి 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. గేమ్ పూర్తయ్యాక తన కుర్చీ వద్దకు వెళ్తూ ‘నేను మోసం చేయడంలేదు’ అని చైర్ అంపైర్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది. కంట కన్నీరు.... జరిమానా రూపంలో గేమ్ ఒసాకాకు ఇవ్వడంతో సెరెనా మరింత రెచ్చిపోయింది. టోర్నీ రిఫరీ కోర్టులోకి రావాలని కోరింది. ‘ఇది అన్యాయం. పురుష ప్లేయర్లు నాకంటే దారుణంగా ఎన్నోసార్లు దూషించారు. కానీ వారిపై ఎలాంటి చర్యలు ఉండవు. నేను మహిళను కాబట్టే నన్ను శిక్షించారు. ఇది సరైన పద్ధతి కాదు’ అని టోర్నీ రిఫరీతో కన్నీరు కారుస్తూ వాపోయింది. టోర్నీ రిఫరీ చైర్ అంపైర్‌తో మాట్లాడి సెరెనాకు సర్దిచెప్పడంతో మళ్లీ ఆట కొనసాగింది. తొమ్మిదో గేమ్‌లో సెరెనా సర్వీస్ నిలబెట్టుకుంది. స్కోరు 5–4 ఉండగా పదో గేమ్‌లో ఒసాకా తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. అయితే కోర్టులో జరిగిన పరిణామాలతో కలత చెందినట్లు కనిపించిన ఒసాకా విజయం అనంతరం సంబరాలను కూడా చేసుకోలేదు. ఒసాకాను ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని అభినందించిన సెరెనా మళ్లీ చైర్ అంపైర్ వద్దకు వెళ్లి తనకు క్షమాపణలు చెప్పాలని కోరింది. ఆయన స్పందించలేదు. దాంతో సెరెనా చైర్ అంపైర్‌తో కరచాలనం చేయకుండానే వెనుదిరిగింది. నువ్వో దొంగవి... రెండో సెట్లో ఆరో గేమ్ ముగిశాక సెరెనా చైర్ అంపైర్‌తో మరోసారి వాగ్వాదానికి దిగింది. ‘నేను గ్యాలరీలో నుంచి ఎలాంటి కోచింగ్ తీసుకోవడంలేదు. నేను మోసానికి పాల్పడటం లేదని మీరు మైక్ ద్వారా ప్రకటించాలి. నాకు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పాలి. నా జీవితంలో నేను ఏనాడూ మోసం చేయలేదు’ అని ఆవేశంతో ఊగిపోయింది. ఆ తర్వాత ఏడో గేమ్‌లో సెరెనా మళ్లీ తన సర్వీస్ చేజార్చుకుంది. ఒసాకా 4–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో మళ్లీ చైర్ అంపైర్‌ను సెరెనా దూషించడం మొదలుపెట్టింది. ‘నువ్వు నా వ్యక్తిత్వాన్ని శంకిస్తున్నావు. నువ్వో అబద్ధాలకోరువి. నువ్వు బతికినంతకాలం నేను ఆడుతున్న మ్యాచ్‌కు అంపైరింగ్ చేయొద్దు. నన్నెప్పుడు క్షమాపణలు కోరుతావ్? ఇప్పుడే క్షమాపణ చెప్పు. నా నుంచి పాయింట్ లాక్కున్నావు. నువ్వు ఓ దొంగవి’ అని తీవ్ర పదజాలాన్ని వాడింది. సెరెనా దూషణ పర్వానికి జరిమానాగా చైర్ అంపైర్ ఈసారి ఏకంగా ఒక గేమ్‌ను ఒసాకాకు ఇచ్చాడు. దాంతో ఒసాకా 5–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. రాకెట్ విరగ్గొట్టి.... రెండో సెట్ నాలుగో గేమ్‌లో ఒసాకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా 3–1తో ముందంజ వేసింది. అయితే ఐదో గేమ్‌లో తన సర్వీస్‌ను కోల్పోయాక సెరెనా తన రాకెట్‌ను నేలకేసి బలంగా కొట్టింది. దాంతో క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు ఆమెపై చైర్ అంపైర్ పెనాల్టీ విధించారు. ఫలితంగా ఒసాకా ఆరో గేమ్‌ను నేరుగా 15–0తో ప్రారంభించింది. తన సర్వీస్‌ను కాపాడుకుంది. స్కోరు 3–3తో సమమైంది. నన్ను క్షమించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు సెరెనా విజయం సాధించాలని కోరుకున్నారని తెలుసు. అయితే ముగింపు ఇలా ఉన్నందుకు క్షమాపణలు కోరుతున్నా. నేనీ స్థాయికి చేరుకోవడానికి అమ్మానాన్న ఎన్నో త్యాగాలు చేశారు. యూఎస్ ఓపెన్ ఫైనల్లో సెరెనాతో ఆడాలని ఎప్పటినుంచో కలలు కన్నాను. నా కల నిజమైనందుకు ఆనందంగా ఉంది. –నయోమి ఒసాకా నయోమి చాలా బాగా ఆడింది. ఆమెకిదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్. మీరందరూ నాకు మద్దతు ఇచ్చేందుకు వచ్చారని తెలుసు. విజయార్హత ఉన్నవారికి గుర్తింపు ఇవ్వాలి. గేలి చేయడం మానేసి మీరందరూ నయోమిని అభినందించాలి. కోచ్ ప్యాట్రిక్ నాకు సలహాలు ఇచ్చానని అంగీకరించారు. కానీ సంకేతాలు ఇస్తున్నపుడు నేను ఆయనవైపు చూడలేదు. నాకు కోర్టులో కోచింగ్ తీసుకోవడం అలవాటు కూడా లేదు. గతంలో పురుష ప్లేయర్లు చైర్ అంపైర్లను చాలా పరుష పదజాలంతో దూషించారు. కానీ వారిపై ఎప్పుడూ గేమ్ పెనాల్టీ విధించలేదు. నేనిక్కడ మహిళల హక్కుల కోసం, వారి సమానత్వం కోసం పోరాడేందుకు ఉన్నాను. నాకు న్యాయం జరగకున్నా భవిష్యత్‌లో ఇతరులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. – సెరెనా -
గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన ఒసాకా
-
క్వార్టర్స్‌లో స్లోన్ స్టీఫెన్స్,సెరెనా
న్యూయార్క్: డిఫెండింగ్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ మరో అలవోక విజయంతో యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ స్లోన్ 6–3, 6–3తో 15వ సీడ్ ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై గెలిచింది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్లోన్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు ఆరుసార్లు చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా), గతేడాది రన్నరప్, 14వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా), ఎనిమిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టగా... ఏడో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) ఇంటిదారి పట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సెరెనా గంటా 37 నిమిషాల్లో 6–0, 4–6, 6–3తో కయి కనెపి (ఎస్తోనియా)పై, ప్లిస్కోవా 6–4, 6–4తో యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)పై, మాడిసన్ కీస్ 6–1, 6–3తో 29వ సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా)పై గెలిచారు. స్వితోలినా 3–6, 6–1, 0–6తో 19వ సీడ్ సెవస్తోవా (లాత్వియా) చేతిలో ఓటమి పాలైంది. నాదల్ ముందంజ... పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), మూడో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా), తొమ్మిదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), 11వ సీడ్ జాన్ ఇస్నెర్ (అమెరికా), మాజీ రన్నరప్ నిషికోరి (జపాన్) క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో నాదల్ 6–3, 6–3, 6–7 (6/8), 6–4తో బాసిలాష్విలి (జార్జియా)పై, డెల్ పొట్రో 6–4, 6–3, 6–1తో బొర్నా కొరిచ్ (క్రొయేషియా)పై, థీమ్ 7–5, 6–2, 7–6 (7/2)తో ఐదో సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై, ఇస్నెర్ 3–6, 6–3, 6–4, 3–6, 6–2తో రావ్‌నిచ్ (కెనడా)పై, నిషికోరి 6–3, 6–2, 7–5తో కోల్‌ష్రైబర్ (జర్మనీ)పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–వాసెలిన్ (ఫ్రాన్స్) జంట 7–6 (8/6), 4–6, 6–3తో జెరెమి చార్డీ–ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్) జోడీపై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. -
సుదీర్ఘ పోరులో సంచలనం
క్వాలిఫయర్ జోనా కొంటా (బ్రిటన్) అద్వితీయ ప్రదర్శనతో తొమ్మిదో సీడ్ ముగురుజా ఆట కట్టించింది. ఏకంగా 3 గంటల 23 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో కొంటా 7-6 (7/4), 6-7 (4/7), 6-2తో ముగురుజాను మట్టికరిపించింది. యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ చరిత్రలో సుదీర్ఘంగా సాగిన మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఇంతకుముందు ఈ రికార్డు 2011లో సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా), నదియా పెత్రోవా (రష్యా-3 గంటల 16 నిమిషాలు)ల పేరిట ఉండేది.