వొజ్నియాకి నిష్క్రమణ | Andreescu defeats Wozniacki to advance to fourth round at US Open | Sakshi
Sakshi News home page

వొజ్నియాకి నిష్క్రమణ

Published Sun, Sep 1 2019 4:53 AM | Last Updated on Sun, Sep 1 2019 4:54 AM

Andreescu defeats Wozniacki to advance to fourth round at US Open - Sakshi

న్యూయార్క్‌: ఈ ఏడాది తన నిరాశాజనక ప్రదర్శన కొనసాగిస్తూ... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, 19వ సీడ్‌ క్రీడాకారిణి కరోలైన్‌ వొజ్నియాకి (డెన్మార్క్‌) యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌ మ్యాచ్‌లో 2009, 2014 రన్నరప్‌ వొజ్నియాకి 4–6, 4–6తో 16వ సీడ్‌ బియాంక ఆండ్రెస్కూ (కెనడా) చేతిలో ఓటమి చవిచూసింది.

ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్, వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌లలో మూడో రౌండ్‌లో వెనుదిరిగిన వొజ్నియాకి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. మరోవైపు ఏడో సీడ్‌ కికి బెర్‌టెన్స్‌ (నెదర్లాండ్స్‌) కూడా మూడో రౌండ్‌లోనే ఓడింది. జూలియా (జర్మనీ) 6–2, 6–3తో కికి బెర్‌టెన్స్‌ను ఓడించింది. ఇతర మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్‌ సెరెనా (అమెరికా) 6–3, 6–2తో ముచోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై, రెండో సీడ్‌ బార్టీ (ఆస్ట్రేలియా) 7–5, 6–3తో సకారి (గ్రీస్‌)పై, పదో సీడ్‌ కీస్‌ (అమెరికా) 6–3, 7–5తో సోఫియా(అమెరికా)పై గెలిచారు.  

నిషికోరికి షాక్‌
పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో ఏడో సీడ్‌ నిషికోరి (జపాన్‌) 2–6, 4–6, 6–2, 3–6తో డి మినార్‌ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడి పోయాడు. టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 6–3, 6–4, 6–2తో డెనిస్‌ కుడ్లా (అమెరికా) పై, ఐదో సీడ్‌ మెద్వెదేవ్‌ (రష్యా) 7–6 (7/1), 4–6, 7–6 (9/7), 6–4తో లోపెజ్‌ పై నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి చేరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement