యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో తాను మోసానికి పాల్పడలేదని అమెరికా స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి, నల్ల కలువ సెరెనా విలియమ్స్ అన్నారు. తుది పోరులో సెరెనా 2-6, 4-6 తేడాతో జపాన్ క్రీడాకారిణి ఒసాకా చేతిలో పరాజయం పాలైంది. ఫలితంగా ఒసాకా టైటిల్ గెలిచి కొత్త చరిత్ర సృష్టించింది.