
అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఎప్పుడు లాక్‌డౌన్ ముగిస్తే అప్పుడు కోర్టులో దిగేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపింది. ‘రియల్ టెన్నిస్’కు తాను సిద్ధమని సోదరి వీనస్‌తో జరిపిన ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్‌లో వెల్లడించింది. 23 గ్రాండ్‌స్లామ్ టోర్నీల చాంపియన్ అయిన ఈ అమెరికా దిగ్గజం బరిలో దిగేందుకు, ఎప్పట్లాగే టెన్నిస్‌ను అస్వాదించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ వీనస్‌కు తెలిపింది. కరోనా మహమ్మారివల్ల వచ్చిన ఈ విరామంతో తగినంత విశ్రాంతి లభించిందని ఇక ఆట ఆడటమే మిగిలుందని పేర్కొంది. ‘ఇప్పుడైతే నేను చాలా బాగున్నాను. పూర్తి ఫిట్‌నెస్‌తో... మరెంతో ఉత్సాహంతో ఉన్నాను. పోటీలు ఎప్పుడు మొదలవుతాయా... ఎప్పుడు కోర్టుల్లో దిగాలా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’ అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment