సెరెనా, ఫెడరర్
మెల్‌బోర్న్: ఆ్రస్టేలియాను అతలాకుతలం చేస్తున్న కార్చిచ్చు బాధితులకు సాంత్వన పలికేందుకు టెన్నిస్ హేమాహేమీలు బరిలోకి దిగనున్నారు. టెన్నిస్ సూపర్‌స్టార్స్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), నాదల్ (స్పెయిన్), సెరెనా (అమెరికా) తదితర దిగ్గజాలు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడేందుకు సై అన్నారు. విరివిగా నిధులు సేకరించేందుకు ఈ చారిటీ మ్యాచ్‌లు దోహదం చేస్తాయని టెన్నిస్ ఆ్రస్టేలియా చీఫ్ క్రెయిగ్ టైలీ వెల్లడించారు. ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్ టోరీ్నకి సరిగ్గా ఐదు రోజుల ముందు ఈ నెల 15న జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల్లో దిగ్గజాలు తలపడతారు. నయోమి ఒసాకా (జపాన్), వొజి్నయాకి (డెన్మార్క్), కిరియోస్ (ఆ్రస్టేలియా), సిట్సిపాస్ (గ్రీస్)లు విరాళాల సేకరణ కోసం హేమాహేమీలతో కలిసి ఆడనున్నారు. ఈ ఎగ్జిబిషన్ చారిటీ మ్యాచ్‌ల ద్వారా సుమారు 1.2 మిలియన్ ఆసీస్ డాలర్లు (రూ.5.88 కోట్లు) సేకరించి బాధితులకు ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment