Tennis stars
-
US Open 2022: సెరెనాపైనే దృష్టి
న్యూయార్క్: రిటైర్మెంట్కు కౌంట్‌డౌన్ మొదలైందని ఇటీవల ప్రకటించిన అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ప్రధాన ఆకర్షణగా నేడు యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి తెర లేవనుంది. 40 ఏళ్ల సెరెనా ఇప్పటివరకు కెరీర్లో 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించింది. మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా–24 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది. 2017లో చివరిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన సెరెనా ఆ తర్వాత మరో నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఫైనల్ చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 21వసారి యూఎస్ ఓపెన్‌లో ఆడుతున్న సెరెనా ఆరుసార్లు విజేతగా, నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచింది. నాలుగుసార్లు సెమీఫైనల్, మూడుసార్లు క్వార్టర్ ఫైనల్ చేరింది. 2008 నుంచి యూఎస్ ఓపెన్‌లో సెరెనా కనీసం సెమీఫైనల్ దశ వరకు చేరుకుంటోంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 80వ ర్యాంకర్ డాంకా కొవినిచ్ (మాంటెనిగ్రో)తో ఆడుతుంది. ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్ (పోలాండ్), రెండుసార్లు విజేత నయోమి ఒసాకా (జపాన్), డిఫెండింగ్ చాంపియన్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్), సిమోనా హలెప్ (రొమేనియా) టైటిల్ ఫేవరెట్స్‌గా ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ మెద్వెదెవ్ (రష్యా), రాఫెల్ నాదల్ (స్పెయిన్), సిట్సిపాస్ (గ్రీస్), నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా), అల్కారజ్ (స్పెయిన్) టైటిల్ రేసులో ఉన్నారు. పురుషుల, మహిళల సింగిల్స్ విభాగం విజేతలకు 26 లక్షల డాలర్ల చొప్పున (రూ. 20 కోట్ల 79 లక్షలు) ప్రైజ్‌మనీ లభిస్తుంది. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి గం. 8:30 నుంచి తొలి రౌండ్ మ్యాచ్‌లు మొదలవుతాయి. మ్యాచ్‌లను సోనీ సిక్స్, సోనీ టెన్–2, సోనీ టెన్–3 చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల కోసం...
మెల్బోర్న్: ఆ్రస్టేలియాను అతలాకుతలం చేస్తున్న కార్చిచ్చు బాధితులకు సాంత్వన పలికేందుకు టెన్నిస్ హేమాహేమీలు బరిలోకి దిగనున్నారు. టెన్నిస్ సూపర్‌స్టార్స్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), నాదల్ (స్పెయిన్), సెరెనా (అమెరికా) తదితర దిగ్గజాలు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడేందుకు సై అన్నారు. విరివిగా నిధులు సేకరించేందుకు ఈ చారిటీ మ్యాచ్‌లు దోహదం చేస్తాయని టెన్నిస్ ఆ్రస్టేలియా చీఫ్ క్రెయిగ్ టైలీ వెల్లడించారు. ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్ టోరీ్నకి సరిగ్గా ఐదు రోజుల ముందు ఈ నెల 15న జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల్లో దిగ్గజాలు తలపడతారు. నయోమి ఒసాకా (జపాన్), వొజి్నయాకి (డెన్మార్క్), కిరియోస్ (ఆ్రస్టేలియా), సిట్సిపాస్ (గ్రీస్)లు విరాళాల సేకరణ కోసం హేమాహేమీలతో కలిసి ఆడనున్నారు. ఈ ఎగ్జిబిషన్ చారిటీ మ్యాచ్‌ల ద్వారా సుమారు 1.2 మిలియన్ ఆసీస్ డాలర్లు (రూ.5.88 కోట్లు) సేకరించి బాధితులకు ఇవ్వనున్నారు. -
ఫెడరర్ షో
నేటి నుంచి ఢిల్లీలో ఐపీటీఎల్ న్యూఢిల్లీ: ఇప్పటిదాకా టీవీల్లోనే చూసిన టెన్నిస్ స్టార్స్ రోజర్ ఫెడరర్, నొవాక్ జొకోవిచ్‌ల ఆటతీరును ఇక భారత అభిమానులు ప్రత్యక్షంగా తిలకించే అవకాశం కలగనుంది. ఫిలిప్పీన్స్, సింగపూర్‌లో విజయవంతంగా ముగిసిన అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) మూడో అంచె పోటీలు నేటి (శనివారం) నుంచి ఢిల్లీలో జరుగనున్నాయి. ఇప్పటిదాకా పోటీలకు దూరంగా ఉన్న ఫెడరర్, జొకోవిచ్ తొలిసారిగా తమ జట్ల తరఫున బరిలోకి దిగబోతున్నారు. ఇండియన్ ఏసెస్ తరఫున ఫెడరర్, యూఏఈ రాయల్స్ తరఫున నొవాక్ జొకోవిచ్ అభిమానులను అలరించనున్నారు. సోమవారం వరకు భారత్‌లో ఐపీటీఎల్ జరుగుతుంది. ఇండియన్ ఏసెస్ ఇప్పటికే ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి 20 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ‘ఫెడరర్, జొకోవిచ్, సంప్రాస్ల కోసం భారత అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వారు కూడా ఇక్కడికి రావడానికి ఉత్సుకతతో ఉన్నారు. ఫెడరర్ కేవలం భారత్‌లో జరిగే పోటీలకు మాత్రమే హాజరుకానున్నాడు. దుబాయ్‌లో జరిగే చివరి లెగ్‌కు అందుబాటులో ఉండడు’ అని టోర్నీ నిర్వాహకుడు మహేశ్ భూపతి తెలిపారు. ఫెడరర్ చివరిసారిగా 2006లో యూనిసెఫ్ తరఫున భారత్‌కు వచ్చాడు. దిగ్గజం ఫెడరర్‌తో కలిసి ఆడాలన్న సానియా కల నిజం కాబోతుంది. ఆదివారం, సోమవారం జరిగే మిక్స్డ్ డబుల్స్‌లో ఫెడరర్, సానియా జతగా బరిలోకి దిగనున్నారు. ఫెడరర్‌తో కలిసి ఆడే అవకాశం రావడంపట్ల సానియా అమితానందం వ్యక్తం చేసింది.