మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో సెరెనా విలియమ్స్ చాంపియన్ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నారు. గంటా 47 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 16వ సీడ్ సెరెనా 6–1, 4–6, 6–4తో టాప్ సీడ్ హలెప్‌ను బోల్తా కొట్టించారు. అయితే, మ్యాచ్‌కు ముందు సెరెనా చేసిన ఓ చిన్న పొరపాటు వల్ల కాస్త గందరగోళం, ఇంకాస్త సరదా సన్నివేశం చోటుచేసుకుంది. అనౌన్సర్ ప్లేయర్లను పరిచయం చేసే క్రమంలో.. ‘టాప్ సీడ్, వరల్డ్ నెంబర్ వన్ సిమోనా హాలెప్ (రొమేనియా) ను ఆహ్వానిస్తున్నాం’ అని చెప్పగానే.. సెరెనా గ్రౌండ్‌లోకి ప్రవేశించేందుకు నడిచారు. (సెరెనా గర్జన)
టన్నెల్ దాటి నాలుగు అడుగులు వేయగానే.. తన పొరపాటును గ్రహించారు. దాంతో వెంటనే వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. హాలెప్ వచ్చిన అనంతరం మళ్లీ వచ్చారు. కాగా, చాలా ఏళ్లపాటు ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణిగా కొనసాగిన సెరేనా ప్రస్తుతం 16వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. ఇక మూడో రౌండ్‌లో సెరెనా సోదరి వీనస్ విలియమ్స్ హాలెప్ చేతిలో ఓడారు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో సెరెనాపై హలెప్ గెలిచుంటే ఒకే టోర్నీలో విలియమ్స్ సిస్టర్స్ వీనస్, సెరెనాలను ఓడించిన తొమ్మిదో క్రీడాకారిణిగా గుర్తింపు పొందేవారు. సెరెనా 2017లో కూతురు అలెక్సిస్ ఒలంపియా ఒహానియన్ జూనియర్‌కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment