
లెక్సింగ్టన్ (అమెరికా): కరోనా మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో... ఆరు నెలల విరామం తర్వాత తాను ఆడుతున్న తొలి టోర్నమెంట్‌లో అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్‌కు ఊహించని పరాజయం ఎదురైంది. టాప్ సీడ్ ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సెరెనా 6–1, 4–6, 6–7 (5/7)తో అమెరికాకే చెందిన ప్రపంచ 116వ ర్యాంకర్ షెల్బీ రోజర్స్ చేతిలో ఓడిపోయింది. తన 25 ఏళ్ల అంతర్జాతీయ ప్రొఫెషనల్ కెరీర్‌లో సెరెనా ఇప్పటివరకు కేవలం నాలుగుసార్లు మాత్రమే ర్యాంకింగ్స్‌లో టాప్–100 బయట ఉన్న వారి చేతిలో పరాజయం పాలైంది. టాప్–100లో లేని క్రీడాకారిణి చేతిలో సెరెనా ఓడిపోవడం చివరిసారి 2012లో జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment