![Serena Williams Wins First Match After 3 Months - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/18/serena.jpg.webp?itok=5U6GHDI7)
పార్మా (ఇటలీ): డబ్ల్యూటీఏ ఎమిలియా రొమానో చాలెంజర్ టోర్నీలో అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సెరెనా 6–3, 6–2తో క్వాలిఫయర్ లీసా పిగాటో (ఇటలీ)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకుంది. మూడు నెలల తర్వాత సెరెనాకు దక్కిన తొలి విజయం ఇదే కావడం విశేషం.
ఇక చివరి సారిగా సెరెనా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో గెలుపొందింది. అయితే ఈ చాలెంజర్ టోర్నీలో ఆఖరి నిమిషంలో వైల్డ్ కార్డ్‌గా బరిలోకి దిగిన సెరెనా బలమైన ఏస్‌లతో పాటు ఫోర్ హ్యాండ్ షాట్లతో విరుచుకుపడ్డ మ్యాచ్‌ను 68 నిమిషాల్లో ముగించింది.
Comments
Please login to add a commentAdd a comment