23 గ్రాండ్‌స్లామ్‌ల విజేతకు షాక్‌.. తొలి రౌండ్‌లోనే నిష్క్రమణ | Wimbledon 2022: Serena Williams Loses In First Round | Sakshi
Sakshi News home page

Wimbledon 2022: 23 గ్రాండ్‌స్లామ్‌ల విజేతకు షాక్‌.. తొలి రౌండ్‌లోనే నిష్క్రమణ

Published Wed, Jun 29 2022 2:59 PM | Last Updated on Wed, Jun 29 2022 3:00 PM

Wimbledon 2022: Serena Williams Loses In First Round - Sakshi

23 గ్రాండ్‌స్లామ్‌ల విజేత, సెవెన్‌ టైమ్‌ వింబుల్డన్‌ ఛాంపియన్‌ సెరీనా విలియమ్స్‌కు వింబుల్డన్-2022లో ఘోర పరాభవం ఎదురైంది. ప్రపంచ 115 ర్యాంకర్‌, ఫ్రాన్స్‌ క్రీడాకారిణి హార్మొనీ టాన్‌ చేతిలో తొలి రౌండ్‌లోనే ఆమె ఓటమిపాలైంది. 3 గంటల 10 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో 5-7, 6-1, 6-7 (7)తో ఓటమిపాలై అభిమానులను దారుణంగా నిరాశపర్చింది. అయితే ఓటమి బాధను దిగమింగుతూ ఆమె మైదానంలో ప్రదర్శించిన హావభావాలు అభిమానుల మనసులను గెలుచుకున్నాయి. పరాజయం అనంతరం సెరీనా చిరునవ్వులు చిందిస్తూ గ్రాస్ కోర్టును వీడటం టెన్నిస్‌ ప్రియులను అమితంగా ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌తోనే వింబుల్డన్ అరంగేట్రం చేసిన హార్మొనీ టాన్‌ అద్భుతమై పోరాటపటిమ కనబర్చి దిగ్గజ క్రీడాకారిణిని మట్టికరిపించింది. పవర్‌ గేమర్‌పై గెలవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందంటూ మ్యాచ్‌ అనంతరం టాన్‌ భావోద్వేగానికి లోనైంది. కాగా, సెరీనా గతేడాది వింబుల్డన్‌లోనూ మొదటి రౌండ్‌లోనే ఇంటి ముఖం పట్టింది. గాయం కారణంగా ఆమె వింబుల్డన్‌ 2021 నుంచి రిటైర్డ్ హార్ట్‌గా వైదొలిగింది. 
చదవండి: చరిత్ర సృష్టించిన జకోవిచ్.. ఆ ఘనత సాధించిన ఏకైక మొనగాడిగా రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement