
ఆరుసార్లు యూఎస్ చాంపియన్ అయిన సెరెనా విలియమ్స్ మరో టైటిల్‌కు రెండడుగుల దూరంలో నిలిచింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 17వ సీడ్ అమెరికన్ స్టార్ 6–4, 6–3తో 8వ సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించింది. 2016లో ఇక్కడ జరిగిన సెమీస్‌లో ప్లిస్కోవా చేతిలో ఎదురైన పరాజయానికి బదులుతీర్చుకుంది.
గంటన్నర (1.26 ని.)లోపే ముగిసిన ఈ మ్యాచ్‌లో సెరెనా 13 ఏస్‌లను సంధించి, 35 విన్నర్లు ఆడింది. సెమీఫైనల్లో అమెరికా నల్లకలువ 19వ సీడ్ అనస్తసిజా సెవస్తోవా (లాత్వియా)తో తలపడనుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 6–7 (5/7), 6–3, 7–6 (7/4), 6–2 జాన్ ఇస్నర్ (అమెరికా)పై విజయం సాధించాడు. సెమీఫైనల్లో నాదల్... డెల్‌పొట్రోతో తలపడతాడు.
Comments
Please login to add a commentAdd a comment